Site icon NTV Telugu

బాలకృష్ణ-మహేష్ అన్ స్టాపబుల్ ప్రోమో.. ప్రముఖ క్రికెటర్ కామెంట్స్..

నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ప్రోగ్రాం అన్ స్టాపబుల్. ఈ ప్రోగ్రాం మొదటి నుంచి అందరిని ఆకర్షిస్తోంది. ఈ ప్రోగ్రాంలో బాలయ్య హోస్ట్ గా ఇరగదీస్తున్నారనే చెప్పాలి. ఈ ప్రోగ్రాంకు వచ్చిన సినీప్రముఖులు గురించి తెలియని విషయాలను ప్రజలకు చెబుతున్నారు బాలయ్య. అయితే తాజాగా ఈ ప్రోగ్రాంకు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు విచ్చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను నిన్న విడుదల చేయగా ప్రస్తుతం నెట్టింట్ల వైరల్ అవుతుంది.

ఈ ప్రోమోలో అన్నిదానాల కన్నా ప్రాణదానం గొప్పది.. వేయి మందికి పైగా చిన్నారులకు మహేష్ గుండె ఆపరేషన్స్ చేయించాడు మహేష్ అని బాలయ్య అభినందించారు. ఈ ప్రోమోపై తాజాగా టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిజంగా ఎంతో ఆదర్శవంతం.. వేయి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిన మహేష్ బాబు వావ్ అంటూ దండం పెట్టె ఎమోజీ తో పాటు చప్పట్లు కొట్టే ఎమోజితో రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Exit mobile version