NTV Telugu Site icon

2024 Oscars: బ్రేకింగ్ – ఆస్కార్స్‌కు మలయాళ సూపర్ హిట్ సినిమా ‘2018’

2018

2018

India sends ‘2018’ movie as entry for 2024 Oscars: ద‌ర్శ‌క‌ధీరుడు SS రాజమౌళి తెర‌కెక్కించిన RRR ఆస్కార్స్‌లో విజయం సాధించడంతో ఈసారి అక్కడి దాకా వెళ్ళేది ఎవరు? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగానే భారతదేశం అకాడమీ అవార్డ్స్ 2024 హంగామా షురూ అయిన క్రమంలో ఈ సారి భార‌త‌దేశం నుంచి ఏ సినిమా అధికారికంగా ప్ర‌వేశిస్తుంది? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ కొన్నాళ్ల క్రితమే మొదలైంది. తాజా క‌థ‌నాల ప్ర‌కారం బలగం, ది కేరళ స్టోరీ, జ్విగాటో, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ వంటి చిత్రాలు పోటీలో ఉన్నాయని షారూఖ్ జ‌వాన్ చిత్రాన్ని కూడా ఆస్కార్ కి పంపిస్తున్నార‌ని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఆస్కార్ కమిటీ చెన్నైలో అనేక ప్రదర్శనలను వీక్షించ‌డం ద్వారా తన ప్రక్రియను ప్రారంభించి ఎట్టకేలకు అధికారికంగా భార‌త‌దేశం నుంచి ఏ సినిమా అధికారికంగా ప్ర‌వేశిస్తుందని క్లారిటీ ఇచ్చారు.

Naseeruddin Shah: ‘ఆర్ఆర్ఆర్, పుష్ప’పై సీనియర్ నటుడు సంచలన ఆరోపణలు

మలయాళ చిత్రం “2018” 2024 అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్) కోసం భారతదేశం అధికారిక ఎంట్రీగా ఎంపిక చేయబడింది. టోవినో థామస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా విజయం సాధించింది. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశాక ఇక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా చూసిన కమిటీ 96వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా పరిగణించబడటానికి ఎంపిక చేయబడింది. కన్నడ చిత్ర దర్శకుడు గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని జ్యూరీ ఈమేరకు ఈ రోజు నిర్ణయం ప్రకటించింది. “2018: ఎవరీ వన్ ఈజ్ హీరో” అనే సినిమా 2018 కేరళ వరదల నేపథ్యంలో ప్రజలు కష్టాల్లో విజయం సాధించే కథగా తెరకెక్కించారు. తెలుగు “బలగం” సినిమా కూడా షార్ట్‌లిస్ట్ కోసం పోటీ పడింది, అయితే వచ్చే ఏడాది ఆస్కార్స్‌లో భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించే ఉత్తమ చిత్రం “2018” అని జ్యూరీ నిర్ణయించింది.

Show comments