Site icon NTV Telugu

Inaya Sultana: సోహెల్‌కు ఐలవ్యూ చెప్పిన ఇనయా.. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా..!!

Inaya Sultana

Inaya Sultana

Inaya Sultana: బిగ్‌బాస్-6తో క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్లలో ఇనయా సుల్తానా ఒకరు. టాప్-5లో ఉంటుందని అందరూ భావించినా అనూహ్యంగా అంతకంటే ముందే ఆమె ఎలిమినేట్ అయ్యింది. అయితే గెస్ట్ ఎపిసోడ్‌లో భాగంగా ఇనయా కోసం సోహెల్ బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చిన స‌మ‌యంలో సోహెల్ అంటే త‌న‌కు ఇష్టమ‌ని, అత‌డే త‌న ఫ‌స్ట్ క్రష్ అని ఇనయా చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె సోహెల్‌కు తన ప్రేమను వ్యక్తం చేసింది. అతడిని డైరెక్టుగా కలిసి గులాబీ పువ్వు ఇచ్చి మరీ లవ్ ప్రపోజ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Prabhas: సుకుమార్ తో ప్రభాస్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్…

ప్రేమ ఉన్నంత వ‌ర‌కు కాదు ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ప్రేమిస్తాను అంటూ సోహెల్‌ ముందు ఇనయా తన ప్రేమను వ్యక్తం చేసింది. తాను ప్రపోజ్ చేయడానికి వచ్చానని.. తన మ‌న‌సులో ఉన్న ఫీలింగ్ చెప్పే అవ‌కాశం ఇన్నాళ్లు రాలేదని ఇనయా చెప్పింది. కానీ ఇప్పుడు అవకాశం వచ్చిందని.. రియ‌ల్లీ ల‌వ్యూ అంటూ సోహెల్‌తో ఎమోషనల్ అయ్యింది. కాగా సోహెల్ కూడా గతంలో బిగ్‌బాస్ 4తో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం అతడు హీరోగా న‌టించిన ‘ల‌క్కీ ల‌క్ష్మణ్’ మూవీ ఈనెల 30న థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version