NTV Telugu Site icon

Sehar Shinwari: పాక్ నటిని ఏకిపారేస్తున్న ఇండియన్స్.. బాగా ఏడువు అంటూ కామెంట్స్

Pak

Pak

Sehar Shinwari: ఇండియా ఫైనల్ కు వెళ్ళిందని.. ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెల్సిందే. న్యూజిల్యాండ్ పై భరత్ ఘనవిజయాన్ని అందుకొని ప్రపంచ కప్ ఫైనల్స్ కు వెళ్ళింది. ఇక ఇప్పటివరకు ఇండియా.. రెండు సార్లు ప్రపంచ కప్ ను అందుకుంది. 1983, 2011లో టైటిల్ విన్నర్ గా నిలిచిన ఇండియా.. ఈసారి కూడా విన్నర్ గా నిలవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇక ఇండియా అంటే పడని వారు ఈ విజయాన్ని చూసి తామా అక్కసును వెళ్లగక్కుతున్నారు. తాజాగా పాక్ నటి సెహర్ శిన్వారీ మరోసారి ఇండియాపై విమర్శలు చేసి.. హాట్ టాపిక్ గా నిలిచింది. ఈమెకు ఇండియా పై పడి ఏడవడమే పని. ఎప్పుడు ఇండియా గెలిచినా కూడా ట్విట్టర్ వేదికగా తన అక్కసును వెళ్లగక్కుతూ ఉంటుంది. ఎందుకంటే.. పాకిస్తాన్ ఏరోజు గెలిచింది లేదు కాబట్టి. ఇక తాజాగా మరోసారి ఇండియాపై తన అక్కసును వెళ్లగక్కింది. ఇండియా ఫైనల్ కు వెళ్లడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ట్వీట్ చేసింది.

Hansika Motwani: పసుపు పచ్చని చీరలో హోయలులికించిన హన్సిక మోత్వాని..

“భారత జట్టు మళ్లీ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకు ఈ నెత్తురోడుతున్న దేశం అన్నింటిలో మనకంటే ముందుంది” అంటూ తన కోపాన్ని, ద్వేషాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతేకాకుండా ఈ మ్యాచ్.. ఫిక్స్ అని తెలిసి కూడా ఇండియా టీమ్ సినిమా వాళ్ళకన్నా ఎక్కువ నటించారు అంటూ చెప్పుకొచ్చింది. అతి త్వరలో బీసీసీఐ, బీజేపీ నాశనం కానున్నాయి అంటూ కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ట్వీట్ పై ఇండియన్స్ తమదైన రీతిలో సమాధానాలు చెప్పుకొస్తున్నారు. గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయకుండా బాంబ్ లు చుట్టుకోండి అని కొందరు. నీ ఏడుపే మాకు గెలుపు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.

Show comments