Site icon NTV Telugu

Prabhas Fauji: ప్రభాస్ కోసం కొత్త భామ.. ఎవరీ ఇమాన్వి.. ఇంత క్యూట్ గా ఉందేంటి?

Prabhas Hanu Pr 2

Prabhas Hanu Pr 2

Iman Esmail Aka Imanvi to Romance With Prabhas in Fauji: ముందుగా ప్రచారం జరిగినట్టుగానే హను రాఘవపూడితో ప్రభాస్ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈరోజు ప్రారంభించింది. చాలా కాలం నుంచి అనేక ప్రచారాలతో వార్తలలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ప్రారంభించబడింది. అసలు విషయానికి వస్తే ప్రభాస్-హను ప్రాజెక్ట్ ఓపెనింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలోనే మనకు పరిచయం లేని ఒక పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదే ఇమాన్ ఎస్మాయిల్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇమాన్ ఎస్మాయిల్ కథానాయికగా నటిస్తోంది. అయితే ప్రెస్ రిలీజ్ లో ఆమె పేరును ఇమాన్వి అని అనౌన్స్ చేశారు. ఆసక్తికర అంశం ఏమిటంటే ఆమె ఇన్స్టా హ్యాండిల్ లో కూడా ఇమాన్వి అనే ఉంది. ఇక ఆమె గురించి ఇంత వైరల్ అవడానికి కారణం ఆమె పాకిస్తాన్లో జన్మించిన వ్యక్తి. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ఇమాన్వి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. మొదటి సినిమానే తెలుగులో ప్రభాస్ తో అది కూడా పాన్ ఇండియా లెవల్లో అంటే అది మామూలు అదృష్టం కాదు.

Roshan : శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా షురూ

ఈ రోజు లాంచ్ వేడుకలో ఇమాన్వి విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అవడం మొదలైంది. ఆమె పేరు ఇప్పటికే ట్రెండ్ అవడం మొదలైంది. అంతేకాదు ఆమె సౌందర్యలా అనిపిస్తోస్తోందని, టాలీవుడ్‌లో తదుపరి పెద్ద హీరోయిన్ అవచ్చని టాక్ మొదలైంది. హను తన మొదటి సినిమా నుంచే తన హీరోయిన్స్ ను చాలా అందంగా చూపిస్తాడని పేరుంది. ఇది ఇమాన్వికి మరో ప్లస్ పాయింట్. ఆమె తన అరంగేట్రం కంటే ముందే సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో న్యూస్ అయిందని చెప్పొచ్చు. పాకిస్తానీ మూలాలు ఉన్నా ఇమాన్వి ఢిల్లీలో సెటిల్ అయింది. ఆమె మంచి డ్యాన్సర్, నటి. ఆమెకు ఆన్‌లైన్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ చిత్రం సుభాష్ చంద్రబోస్ పాలనలో జరిగే పీరియాడికల్ డ్రామా, అని ఈ ప్రేమకథలో ప్రభాస్ ఆర్మీ మేన్‌గా కనిపించనున్నాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఇందుకోసం రామోజీ ఫిల్మీ సిటీలో భారీ సెట్‌ను కూడా నిర్మిస్తున్నారు. ఈ సెట్‌లోనే ఎక్కువ భాగం షూటింగ్ జరగనుంది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ మళ్లీ రొమాన్స్ జోనర్‌లోకి వచ్చి చేస్తున్న సినిమా ఇది.

Exit mobile version