ఇప్పుడంటే కృతి శెట్టి, శ్రీ లీలా, పూజా హెగ్డే, రష్మికలని క్రష్ అంటున్నారు కానీ సరిగ్గా ఒక పదేళ్ల క్రితం వరకూ ప్రతి తెలుగు సినీ అభిమానికి ఉన్న ఒకేఒక్క క్రష్ ‘ఇలియానా’ మాత్రమే. నడుము అందాలతో అభిమానులని సొంతం చేసుకున్న ఈ గోవా బ్యూటీ, హాట్ నెస్ అనే పదానికే నిలువెత్తు నిదర్శనంలా ఉండేది. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో కోటి రూపాయలు రేమ్యునరేషన్ తీసుకునే వరకూ వెళ్లిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ పై మనసు పారేసుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని వదులుకోని బాలీవుడ్ న్ని దున్నేద్దాం అనే ఆలోచనతో ముంబైలో అడుగు పెట్టిన ఇలియానాకి నార్త్ ఆడియన్స్ అండ్ హిందీ ఫిల్మ్ మేకర్స్ సార్టింగ్ లో బాగానే సపోర్ట్ చేశారు కానీ ఆ తర్వాత సినిమాలు ఇవ్వడం మానేసారు.
దీంతో ఆమె కెరీర్ అటు తెలుగుకీ, ఇటు హిందీకి కాకుండా రెంటికి చెడ్డ రేవడిలా మారింది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తున్న ఇలియానాకి ప్రస్తుతం పూర్తిగా సినిమా అవకాశాలు లేవు. సినిమాలు లేకపోవడంతో కంబ్యాక్ ఇవ్వడానికి ఇలియానా ఆల్బమ్ సాంగ్స్ ని నమ్ముకుంది. ఆల్బమ్ సాంగ్స్ చేసే మంజిత్ సింగ్ మరియు సుఖ్‌జిత్ సింగ్ లతో కలిసి ఇలియానా “సబ్ గజబ్” అనే ప్రైవేట్ సాంగ్ చేస్తుంది. ఈ సాంగ్ ని అనౌన్స్ చేస్తూ పోస్టర్ బయటకి వచ్చింది. ఈ ఫోటోలో ఇలియానా మైండ్ బ్లాక్ అయ్యేలా మెస్మరైజింగ్ గా ఉంది. ఈ ఫోటోలో ఇలియానా హాట్‌నెస్ నుండి తప్పించుకునే అవకాశం లేదు అనే అంతలా ఆడియన్స్ కి అందంతో మత్తు మందు చల్లుతుంది. మరి ఈ పాటతో అయినా ఇలియానా కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.