Ileana: దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. బెత్తెడంత నడుము ఒంపులతో కుర్రకారును ఊపేసిన ఈ భామ.. ప్రేమ మత్తులో పడి కెరీర్ ను గాలికి వదిలేసింది. ఇక ఆ ప్రేమ కాస్తా పెళ్లి వరకు వెళ్తుంది అనుకుంటే.. మధ్యలోనే బ్రేకప్ తో ముగిసిపోయింది. దీనివలన అమ్మడు చాలా ఎఫెక్ట్ అయ్యింది. ఎంతలా అంటే.. నడుము.. అనగానే గుర్తొచ్చే ఇలియానా.. బరువు పెరిగి.. ఏంటి ఈమె ఇలియానా అని అనేదాకా. అంతలా ఆమెలో మార్పులు వచ్చాయి. అయినా ఎక్కడా అధైర్యపడకుండా.. కెరటం లేచి నిలబడినట్లు నిలబడింది. అవమానాలను, ట్రోల్స్ ను పట్టించుకోకుండా కష్టపడి తన మునుపటి రూపానికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఇంకోపక్క బాలీవుడ్ లో మంచి ఆఫర్లను పట్టేసింది.. యాడ్స్ అయితే ఇక చెప్పనే అవసరం లేదు. నిత్యం.. సోషల్ మీడియాలో మూడు హాట్ ఫోటోషూట్స్.. ఆరు యాడ్ షూట్స్ తో కెరీర్ ను ముందుకు నెట్టుకొస్తున్న ఇల్లూ బేబీ.. ఒక్కసారిగా ప్రెగ్నెంట్ అని బాంబ్ పేల్చేసింది.
పెళ్లికి ముందు బిడ్డను కనాలనుకోవడం అది వారి పర్సనల్.. అందులో ఎవరు తప్పు పట్టడం లేదు. అయితే ఆ బిడ్డకు తండ్రి ఎవరు..? అనేది అభిమానులకు చెప్తే బావుంటుంది కదా అని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. సరోగసీ ద్వారా బిడ్డను కంటుందా..? లేక ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుందా..? లేక ప్రేమించినవాడితో రిలేషన్ లో ఉందా..? ఇలా రకరకాల ప్రశ్నలతో బుర్రను బద్దలుకొట్టుకుంటున్నారు. ఇక తాజాగా ఇలియానా తన బేబీ బంప్ ఫోటోను షేర్ చేసింది. దీంతో మరోసారి ఇల్లూ బేబీ కి తండ్రి ఎవరు..? అని రచ్చ మొదలయ్యింది. ఇలియానా అభిమానులు అయితే .. ఏం.. ఇల్లూ బేబీ.. నీ బిడ్డకు తండ్రెవరో చెప్తే.. మేము సంతోషిస్తాం కదా అని ప్రేమగా అడుగుతున్నారు కూడా. మరి ఈ గోవా బ్యూటీ ఆ సీక్రెట్ ను ఎప్పుడు బయటపెడుతుందో చూడాలి.