Site icon NTV Telugu

Ileana: తొలిసారి బేబీ బంప్ తో ఇలియానా.. ఇప్పటికైనా చెప్పు ఆ బిడ్డకు తండ్రి ఎవరు..?

Iliana

Iliana

Ileana: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని బాహుబలి 2 వచ్చేవరకు అభిమానులు ఎంత తలలు బాదుకుని ఆలోచించారో.. ఇప్పుడు ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరు..? అనేది కూడా అంతే ఆలోచిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. సరోగసీ కాదు, ఇల్లూ బేబీకి పెళ్లి కాలేదు.. మరేలా ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రస్తుత సమాజంలో ఎవరి ఇష్టం వారిది.. కానీ, తమ అభిమాన నటికి పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అని తెలుసుకోవాలని అభిమానులకు కూడా ఉంటుంది కదా అని అంటున్నారు అభిమానులు. అందుకైనా ఇలియానా.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరుతున్నారు. బ్రేకప్ తరువాత బరువు పెరిగిన ఈ చిన్నది .. ఇప్పుడిప్పుడే బరువు తగ్గి కనిపిస్తోంది. ఈలోపే నేను ప్రెగ్నెంట్ అని బాంబ్ పేల్చింది గోవా బ్యూటీ.

ఇక నిత్యం.. ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. తన బేబీ గురించే అందరు మాట్లాడుకొనేలా చేస్తోంది. మొదటిసారి.. ఆమె.. తాను తల్లి కాబోతున్నాను అని ప్రకటించినప్పుడు.. సరోగసీ ద్వారా బిడ్డను కంటుందేమో.. అనుకున్నారు. అయితే అదేమీ నిజం కాదని తాజా ఫోటోతో క్లారిటీ వచ్చేసింది. మొట్ట మొదటిసారి తన బేబీ బంప్ తో ఫోటోలకు ఫోజు ఇచ్చింది ఇలియానా.. బ్లాక్ కలర్ డ్రెస్ ల బేబీ బంప్ పై చెయ్యి వేసి.. నవ్వులు చిందిస్తూ .. బంప్ అలర్ట్ అని చెప్పుకొచ్చింది. ఇంకేముంది.. నిజంగానే ఇలియానా ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికి బోధపడింది. అయితే ఇప్పటికైనా ఆ బేబీకి తండ్రి ఎవరో చెప్పొచ్చు కదా ఇల్లూ బేబీ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏమి ఇలియానా.. తన బిడ్డను, ఆ బిడ్డ తండ్రిని ఒకేసారి పరిచయం చేస్తుందేమో చూడాలి అంటున్నారు మరికొందరు.. ఏదిఏమైనా నీ ఆరోగ్యం జాగ్రత్త అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version