సంగీత దిగ్గజం ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు తరాలుగా ఆయన స్థానం అలాగే ఉంది. అతని బీట్ చేసిన వారు లేరు. ఇళయరాజా మ్యూజిక్ లో ఒక పాట వచ్చింది అంటే శాశ్వతంగా గుండెల్లో నిలిచిపోయినట్లే. పాత తరం నుండి నేటి డిజిటల్ జనరేషన్ వరకు ఆయన ఫ్యాన్ బేస్ అలాగే ఉంది. ఇక ఇప్పటి వరకు 1500 కు పైగా సినిమాలకు సంగీతం అందించిన ఆయన, 7000 కు పైగా పాటలను అందించారు.ఇదిలా ఉంటే ఇళయరాజా బయట మాట్లాడటం తక్కువ..ఎక్కువగా మీడియా ముందుకు కూడా రారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి..ఇంతకీ ఏం జరిగిందంటే.
Also Read:Allu Aravind : దేవి శ్రీ ప్రసాద్‌ని వద్దు అనడానికి కారణం ఇదే : అల్లు అరవింద్
ఇళయరాజా మాట్లాడుతూ.. ‘ నేను మ్యూజిక్ కంపోజ్ చేసిన పలు పాటల ద్వారా వెస్ట్రన్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేశాను, మొజార్ట్, బచ్చ్, బీతోవెన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులను భారతీయులకు పరిచయం చేసింది కూడా నేనే. నా సంగీతం వినడం ఓ కళ! నా సంగీతానికి మాత్రమే కాదు, నా ప్రతిభకు నేను గర్వపడతాను. నేను సాధించిన ఘనతను మరెవరు సాధించలేదు. నాకు పొగరు కూడా ఉంది, ఎందుకంటే టాలెంట్ ఉన్నవారికే పొగరు ఉంటుంది. నా సంగీతం విని ఓ చిన్నారి తిరిగి శ్వాస తీసుకుంది. ఒకసారి ఏనుగుల గుంపు నా పాట వినడానికి వచ్చాయి’ అని వింత అనుభవాలు కూడా షేర్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు కొన్ని వర్గాల్లో విమర్శలకు గురవుతున్నప్పటికీ. తన అభిమానులు మాత్రం ఇళయరాజా మాటల్లో నమ్మకం, ఆయన సాధించిన ఘనతకు అలా మాట్లాడటం తప్పేం లేదు అని ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రజంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.