Site icon NTV Telugu

ఇళయరాజా ఆరోగ్యంపై పుకార్లు.. క్లారిటీ ఇదిగో

ilayaraja

ilayaraja

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా ఆరోగ్యం బాగోలేదని. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటున్నారని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలు నిజమో, కాదో తెలియకుండానే నెటిజన్లు ఇళయరాజా కోలుకోవాలని కామెంట్స్ పెట్టేస్తున్నారు. ఇక తాజాగా ఈ పుకార్లకు చెక్ పెట్టారు ఇళయరాజా.. ఎంతో చక్కగా తనదైన శైలిలో ఒక మధురమైన పాటను ఆలపిస్తూ అందరికి నూతన సంవత్సర శుబాకాంక్షలు తెలుపుతూ వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోతో పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది. సోషల్ మీడియా వచ్చాకా ఫేక్ న్యూస్ ఎక్కువయిపోతుందని, బ్రతికున్నవారిని కూడా తమ వ్యూస్ కోసం కొంతమంది చంపేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

Exit mobile version