Venkat Prabhu: చైతు, కృతి చిత్రానికి ఇళయరాజా – యువన్ సంగీతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగ చైతన్య తన 22వ సినిమా కోసం ఏస్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేతులు కలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం గ్రాండ్‌గా రూపుదిద్దుకోనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ను నిర్మించనున్నారు. కృతిశెట్టి ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరు కలిసి సంగీతం చేస్తున్న మొదటి చిత్రమిది. ఈ కాంబినేషన్ లో చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పాలి.
Also Read
- AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
- SPIRIT Karnataka Rights : 'స్పిరిట్' కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
- NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు

ఈ కాంబినేషన్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ లాంచ్ ఈవెంట్‌కి చిత్ర యూనిట్ తో పాటు సౌత్ సెలబ్రిటీలు శివ కార్తికేయన్, గంగై అమరన్, యువన్ శంకర్ రాజా, ప్రేమ్‌జీ హాజరయ్యారు. లీడ్ పెయిర్‌పై చిత్రీకరించిన ముహూర్తానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ ఇవ్వగా, పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి కెమెరా స్విచాన్ చేసారు. ప్రముఖ నటుడు, దర్శకుడు భారతి రాజా, దర్శకుడు ఎన్. లింగుసామి, బూరుగుపల్లి శివరామ కృష్ణ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. నాగచైతన్య కు ఇది మొదటి తమిళ చిత్రం కాగా, వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇదే! అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై నుండి మొదలు కానుంది.
తాజావార్తలు
-
CJP Protest: పేద-ధనిక భేదం లేకుండా విద్యార్థుల పోరు.. 2012 నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆ స్థాయి విప్లవం!
-
Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
-
AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
-
TVK: నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
-
Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!