Site icon NTV Telugu

Venkat Prabhu: చైతు, కృతి చిత్రానికి ఇళయరాజా – యువన్ సంగీతం!

Naga Chaitanya

Naga Chaitanya

 

అక్కినేని నాగ చైతన్య తన 22వ సినిమా కోసం ఏస్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేతులు కలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం గ్రాండ్‌గా రూపుదిద్దుకోనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు. కృతిశెట్టి ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరు కలిసి సంగీతం చేస్తున్న మొదటి చిత్రమిది. ఈ కాంబినేషన్‌ లో చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పాలి.

 

ఈ కాంబినేషన్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ లాంచ్ ఈవెంట్‌కి చిత్ర యూనిట్ తో పాటు సౌత్ సెలబ్రిటీలు శివ కార్తికేయన్, గంగై అమరన్, యువన్ శంకర్ రాజా, ప్రేమ్‌జీ హాజరయ్యారు. లీడ్ పెయిర్‌పై చిత్రీకరించిన ముహూర్తానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్‌ ఇవ్వగా, పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి కెమెరా స్విచాన్ చేసారు. ప్రముఖ నటుడు, దర్శకుడు భారతి రాజా, దర్శకుడు ఎన్. లింగుసామి, బూరుగుపల్లి శివరామ కృష్ణ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. నాగచైతన్య కు ఇది మొదటి తమిళ చిత్రం కాగా, వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇదే! అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై నుండి మొదలు కానుంది.

Exit mobile version