NTV Telugu Site icon

Allu Arjun: నాకు ఉంది అభిమానులు కాదు ఆర్మీ.. తగ్గదు అది

Allu Arjun

Allu Arjun

Allu Arjun: శ్రీ విష్ణు, కాయాదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల్లూరి. సెప్టెంబర్ 23 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ” నేను ఎప్పుడో అన్నాను నాకు ఉంది అభిమానులు కాదు ఆర్మీ అని.. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అది నిజమనిపిస్తోంది. మీ అల్లరే మాకు ఎంతో జోష్ నింపుతోంది. అల్లూరి సినిమా గురించి చెప్పాలంటే.. ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. బెక్కెం వేణు గోపాల్ గారి సినిమాలు అన్ని నేను చూసాను. ప్రేమ ఇష్క్ కాదల్ నుంచి హుషారు వరకు అన్ని సినిమాలు చూసాను. ఈ సినిమా కూడా మంచి విజయం సాదించాలని కోరుకుంటున్నాను.

ఇక శ్రీ విష్ణు.. నాకు తన మొదటి సినిమా నుంచే తెగ నచ్చేసాడు. అందుకే పిలిచి నాకు చెప్పాలనిపించి చెప్పాను. ఆయన ఎంచుకొనే ప్రతి కథ ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది. ఆయనకో టేస్ట్ ఉంది.. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆ సినిమా గురించి చాలా తపన పడతాడు. అప్పట్లో ఒకడుండేవాడు, బ్రోచేవారెవరు రా, మెంటల్ మదిలో, రాజరాజ చోర.. ఇవన్నీ నేను చూశాను. ఆయన ఎత్తుకొనే ప్రతి సినిమా ఒక నోవాలిటీ ఉంటుంది. అంత కష్టపడి తీసే వ్యక్తికీ ప్రేక్షకులు ఆదరించి ఇంకా మంచి ఎత్తుకు ఎదిగేలాని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 23 న కూడా అల్లూరి సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇక విష్ణు ఎప్పుడు వచ్చి ఏమి అడగని వ్యక్తి ఈ సినిమా ఈవెంట్ కు రమ్మని ఆఫీస్ కు వచ్చి కలిశాడు. పుష్ప 2 వర్క్ లో బిజీగా ఉన్నా.. వింటున్నాను.. చెప్తున్నాడు. సరే డేట్ చెప్పు వస్తాను అని చెప్పాను.

ఎందుకంటే ఇంతగా కష్టపడే ఒక హీరో.. తన సినిమాలు ప్రమోట్ చేసుకోలేక ఇబ్బందిపడుతున్నాడు అని అప్పుడేరావాలని నిర్ణయించుకున్నాను. అందరూ ప్రస్తుతం సినిమాల గురించి చెప్తున్నారు.. లాస్ట్ పాండమిక్ నుంచి అన్ని సినిమాలు వస్తున్నాయి.. చిన్న సినిమాలు వర్క్ అవుట్ అవుతున్నాయి.. కొన్ని సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.. అలాగే పెద్ద సినిమాలు కొన్ని వర్క్ అవుట్ అవుతున్నాయి.. మరికొన్న ప్లాప్ అవుతున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్ ఒకటే.. చిన్న సినిమా, పెద్ద సినిమా కాదు.. మంచి సినిమా. మంచి సినిమా ఉంటే జనాలు ఆదరిస్తున్నారు.. అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని చూడడంలేదు. మనం ఇప్పుడు మంచి ట్రెండ్ లో ఉన్నాం.. ఎవరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు.. సినిమా బావుంటే అద్భుతంగా థియేటర్ కు వచ్చి చూస్తున్నారు దానికి ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చాడు.

Show comments