NTV Telugu Site icon

Allu Arjun: బ్రేకింగ్.. నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ

Bunnt

Bunnt

Allu Arjun: ఎట్టకేలకు టాలీవుడ్ కల నెరవేరింది. 69 ఏళ్లుగా ఒక టాలీవుడ్ హీరో అందుకోలేని అవార్డును.. ఎట్టకేలకు అల్లు అర్జున్ కైవసం చేసుకున్నాడు. నేడు ఢిల్లీలో ఈ జాతీయ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా గెలిచిన నటీనటులు అవార్డులు అందుకున్నారు. ఇక పుష్ప చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. వైట్ అండ్ వైట్ డిజైనర్ డ్రెస్ లో అల్లు అర్జున్ ఎంతో అద్భుతంగా కనిపించాడు.

Polimera 2: పొలిమేర 2 కు ప్రమోషన్స్ చేస్తుంటే.. పొలిమేర 1 ను చూసేస్తున్నారేంటి

ఇక అల్లు అర్జున్ స్టేజిమీదకు రావడంతోనే.. మిగతానటీనటులందరూ ఫొటోగ్రాఫర్లుగా మారిపోయారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్.. బన్నీ అవార్డు అందుకుంటున్న సమయంలో ఫోటో తీస్తూ కనిపించడం ఆకట్టుకుంటుంది. ఇక బన్నీతో పాటు పుష్ప సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ అవార్డును అందుకున్నాడు. ఇక వీరితో పాటు.. బెస్ట్ సినిమా ఉప్పెనకు గాను బుచ్చిబాబు సానా అందుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments