తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. సుశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ దర్శన్ దర్శకత్వం వహించారు. ఏఐ స్టూడియోస్ అండ్ శాస్త్రా మూవీస్ బ్యానర్‌ల కింద రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కొయ్యలగుండ్ల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చారు. ఈ సినిమాతో బాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ మూవీ కథ వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందింది. ఈ చిత్రం ఒక నవల కాన్సెప్ట్‌తో విలక్షణమైన థ్రిల్లర్‌గా రూపొందింది.
Read Also : “చిరు 153” రీమేక్ షూటింగ్ షురూ
తాజాగా “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఆగస్ట్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. 12 మార్చి 2021లో విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు. గ్యారీ సినిమాకు ఎడిటింగ్ చేస్తున్నారు. ఎమ్ సుకుమార్ కెమెరా నిర్వహిస్తున్నారు.
