యంగ్ హీరో సుశాంత్ యాక్షన్ థ్రిల్లర్ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్స్ పూర్తి చేయాలని సుశాంత్ కోరుకుంటున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగష్టు 27న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శన్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఏఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ బ్యానర్ పై ఈ మూవీ సంయుక్తంగా రూపొందింది. ఈ మూవీ విడుదలకు ముందే నిర్మాతలు మంచి టేబుల్ ప్రాఫిట్ చూసినట్టు తెలుస్తోంది.
Read Also : ఓటీటీ కోసం తెలుగులో మరో కొత్త ‘బిగ్ బాస్’
“ఇచ్చట వాహనములు నిలుపరాదు” 6.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది. నాన్-థియేట్రికల్ బిజినెస్ తోనే లాభాలను చూశారట. మేకర్స్ సినిమా ఓటిటి, శాటిలైట్, హిందీ మ్యూజిక్ హక్కులను విక్రయించారు. ఓటిటి హక్కుల కోసం ఆహా 3 కోట్లు, హిందీ హక్కులు సోనీ 2.75 కోట్లకు, శాటిలైట్ రైట్స్ 2 కోట్లకి అమ్ముడయ్యాయి. ఆదిత్య మ్యూజిక్ 15 లక్షలకు మ్యూజిక్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఇంకేముంది డిజిటల్ డీల్స్ ద్వారానే మేకర్స్ 1.5 కోట్ల లాభాలను జేబులో వేసుకున్నారు.
