IBomma Ravi : తెలంగాణలో సంచలనం రేపుతున్న ఐ బొమ్మ రవి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రవిని మళ్లీ పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు చేసిన వినతిపై నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. కేసు దర్యాప్తు కొనసాగించేందుకు అవసరమైన వివరాలు సేకరించాల్సి ఉందని సీసీఎస్ పోలీసులు వాదించగా, కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.
Rare Earth Magnets: చైనా ఆంక్షల మధ్య, “రేర్ ఎర్త్ అయస్కాంతాల”పై క్యాబినెట్ కీలక నిర్ణయం..
ఇప్పటికే రవి చంచల్గూడా జైలులో రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో, రేపు ఉదయం పోలీసులు జైలు అధికారుల అనుమతితో అతన్ని బయటకు తీసుకుని సీసీఎస్ కార్యాలయానికి తరలించనున్నారు. అక్కడ మూడు రోజులపాటు రవిని ప్రశ్నించి, కేసుతో సంబంధం ఉన్న డిజిటల్ పరికరాలు, ఆర్థిక లావాదేవీలు, మిగతా వ్యక్తులతో ఉన్న అనుసంధానాలు వంటి అంశాలపై వివరాలు సేకరించనున్నారు.
ఇటీవల రవిపై వరుసగా కేసులు నమోదవుతూ ఉండటం, పీటీ వారెంట్‌ల ఆధారంగా పలు పోలీస్ స్టేషన్ల పోలీసులు కస్టడీ కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఐదు పైగా కేసుల్లో రవి అరెస్టు కాగా, దర్యాప్తు పురోగతి కోసం మరిన్ని వివరాలు వెలికితీయాల్సి ఉందని సీసీఎస్ అధికారులు వెల్లడిస్తున్నారు. పోలీస్ కస్టడీ పూర్తయ్యాక, రవిని తిరిగి చంచల్గూడా జైలుకు తరలించనున్నారు. ఈ కేసు నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.
Rajeev Chandrasekhar: ముస్లింలు మాకు ఓటేయరు, అందుకే మంత్రి పదవి లేదు..
