గాడ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా విజయోత్సవ వేడుక అనంతపురంలో గ్రాండ్ గా జరింగింది. ఈ సందర్భమగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘అనంతపురం ప్రజలు నాకు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు. ‘రాయలసీమ బాలకృష్ణ అడ్డా’. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు సినిమాలు గుంటూరులో ఒక జాతర లాగా చూసిన కుర్రాణ్ణి నేను. ఒక దర్శకుడిగా సక్సెస్ మీట్ కి రావడం సంతోషంగా ఉంది. నేను సినిమాల్లోకి వెళ్తానంటే నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు ముందుగా కృతఙ్ఞతలు. నేను చిరంజీవి అభిమానిని అని చెప్పినా కూడా బాలయ్య నన్ను దర్శకుడిగా ఎంతో ప్రోత్సహించారు.
Also Read : ITRaids : టాలీవుడ్ లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు
బాలయ్యకు నిజాయితీగా ఉంటే ఇష్టం. అబద్ధాలకు బాలయ్య దగ్గర చోటు లేదు. మా నాన్న మరణించక ముందు నేను బాలయ్యను కలిసి ఉంటే మా నాన్న నాకు ఇంకా బాగా అర్ధమయ్యేవారు అనిపిస్తుంది. మా నాన్న కూడా ఇలాగే ప్యూర్ హార్ట్ తో ఉంటారు. ప్రేమైనా కోపమైనా అప్పుడే చూపిస్తారు. ఒకప్పుడు నాకు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి లాంటి గొప్ప వ్యక్తి కొడుకుగా తెలుసు, కోట్ల మంది అభిమానులకు దేవుడని తెలుసు, మాట ఇస్తే నిలబడతారని తెలుసు. కానీ దగ్గర నుంచి చూసాక బాలకృష్ణ గారిది ఎంత గొప్ప మనసో తెలిసింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాలకృష్ణ అభిమానులు ఫోన్లు, మెసేజ్ లు చేసి మంచి సినిమా చేశారని మెచ్చుకున్నారు. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడారని విన్నాను. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గారికి ఫాలోవర్ ని అయిపోయాను. హీరోని అభిమానించే, దర్శకుడిని నమ్మే నిర్మాత నాగవంశీ గారి వల్లే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది. బాలయ్యతో డాకు మహారాజ్ ని మించి పాన్ ఇండియా భాషలలో గొప్ప చిత్రం చేస్తానని మాట ఇస్తున్నాను’ అని అన్నారు.