Site icon NTV Telugu

Vijay: నాకు ఫస్ట్ అసలు శివ కనెక్ట్ కాలేదు… ఆ తర్వాత సమంత ఇన్వాల్వ్ అయ్యింది

Vijay Deverakonda

Vijay Deverakonda

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్న విజయ్ దేవరకొండకి ఖుషి సినిమా హిట్ ఇస్తుందో లేదో మరో 24 గంటల్లో తెలిసిపోనుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ సాంగ్స్ తో మంచి బజ్ నే జనరేట్ చేసింది. టీజర్, ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ విషయంలో విజయ్ దేవరకొండ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో మనకి తెలిసిన విషయమే. ఖుషి సినిమా ప్రమోషన్స్ ని కూడా విజయ్ అదే జోష్ లో చేస్తున్నాడు. ఇందులో లాస్ లెగ్ ఆఫ్ ప్రమోషన్స్ గా విజయ్ దేవరకొండ నేషనల్ వైడ్ ఉన్న తన అభిమానులతో క్యూ అండ్ ఏ సెషన్ లో పాల్గొన్నాడు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ స్ట్రీమ్ అయిన ఈ ఫ్యాన్స్ ఇంటరాక్షన్ లో… విజయ్ దేవరకొండ ఖుషి సినిమా జర్నీ గురించి చెప్పాడు. ఈ సమయంలో శివ నిర్వాణ స్టార్టింగ్ లో అసలు తనకి కనెక్ట్ కాలేదని, ఆ సమయంలో సమంత తనకి ఎలా ఉండాలో సజెషన్స్ ఇచ్చిందని విజయ్ దేవరకొండ చెప్పాడు.

“డైరెక్టర్ శివతో కనెక్ట్ అయ్యేందుకు నాకు ఓ నెల రోజుల టైమ్ పట్టింది. ఫస్ట్ ఏదైనా నచ్చుకుంటే బాగా లేదని ఓపెన్ గా చెప్పేవాడిని. అది చూసిన సమంత.. విజయ్ ఏం చెప్పాలన్నా ఓ పద్ధతి ఉంటుంది.. అలా ఫేస్ మీదే చెప్పకూడదు అని సజెస్ట్ చేసింది. శివ నేను కనెక్ట్ అయిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం ఏర్పడింది. పాటల దగ్గర నుంచి ప్రతీది ఆయన డెసిషన్ కే వదిలేశా. ఎందుకంటే శివకు సినిమా పిచ్చి. తన సినిమా ఎలా ఉండాలో ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఆ ఫ్రేమ్ నుంచి బయటకు రాడు. మనం ఏదైనా బాగుంటుందని చెబితే నచ్చితే తీసుకుంటాడు. అది కథకు అవసరం ఉండదు అనుకుంటే ఎందుకు ఉండదో చెబుతాడు” అంటూ విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. హీరో ఓరియెంటెడ్ సినిమాలు చేసే విజయ్ దేవరకొండకి శివ నిర్వాణ సెన్సిబిలిటీస్ కలవడానికి తప్పకుండా టైమ్ పడుతుంది. ఎంత టైమ్ పట్టినా ఓవరాల్ గా ఇద్దరూ కలిసి ఒక మంచి సినిమాని ఆడియన్స్ కి ఇస్తే చాలు.

Exit mobile version