Site icon NTV Telugu

Rashi Khanna : సౌత్ లో బాడీ షేమింగ్… గ్యాస్ ట్యాంకర్ అన్నారు !!

Rashi-khanna

Rashi Khanna ప్రస్తుతం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌’లో అలియా పాత్రలో కన్పించి మెప్పించింది. చాలా రోజుల తరువాత బాలీవుడ్ లో ‘రుద్ర’తో అందుకున్న విజయాన్ని ఆస్వాదిస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాశి సౌత్ లో బాడీ షేమింగ్ ఎదురైందని వెల్లడించింది. బొద్దుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రాశీ ఖన్నా బాడీ షేమింగ్‌తో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. రాశి తెలుగుతో పాటు మలయాళం, తమిళ చిత్రాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే అధిక బరువు ఉన్నందుకు దక్షిణాది ప్రజలు తనను ‘గ్యాస్ ట్యాంకర్’ అని పిలిచేవారని గుర్తు చేసుకుంది. వాళ్ళు అలా పిలిచినప్పటికీ తాను పట్టించుకోలేదని, అలాగే తాను ఇప్పుడు ఫిట్ గా మారింది వాళ్ళ కోసం కాదని, తన సినీ కెరీర్ కోసమని వెల్లడించింది.

Read Also : Samantha : ఎట్టకేలకు చైని ఫాలో చేయడం ఆపేసిన బ్యూటీ

ఈ క్రమంలో పిసిఒడితో పోరాడినట్టు కూడా వెల్లడించింది. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. పైగా కేవలం వారు తెరపై మాత్రమే తనను చూస్తారు. కాబట్టి ఎవరిని నిందించలేమని చెప్పుకొచ్చింది రాశి ఖన్నా. ఇక ఆన్‌లైన్‌లో, వ్యక్తిగతంగా ఎదురైన బెదిరింపులు తనను బాధించలేదని రాశి చెప్పింది. ఇదిలా ఉంటే రాశి ఖన్నా ప్రస్తుతం కార్తీ నటించిన తమిళ చిత్రం ‘సర్దార్‌’లో కనిపించనుంది. ఆమె బాలీవుడ్‌లో ‘యోధా’, టాలీవుడ్ లో నాగ చైతన్యతో కలిసి ‘థ్యాంక్యూ’ సినిమాలో నటిస్తోంది.

Exit mobile version