NTV Telugu Site icon

Kiran Abbavaram : ఆ సినిమా చూడలేక థియేటర్ నుండి వెళ్లిపోయాను

Kiran Abbavaram

Kiran Abbavaram

టాలీవుడ్ యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు. గతేదాడి కిరణ్ నటించిన ‘క’ సినిమాతో కెరీర్ బిగ్గెట్ హిట్ అందుకుని హిట్ ట్రాక్ ఎక్కిన ఫుల్ జోష్ తో వరుస సినిమాలు ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన దిల్ రూబా ఈ నెల 14న థియేటర్స్ లో రిలీజ్ కు రెడీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో కంటెంట్ సినిమా పట్ల మంచి బజ్ తీసుకువచ్చాయి.

Also Read : Dragon : ఒకే ఒక హిట్టుతో ఆ హీరోయిన్ లైఫ్ టర్న్

కాగా దిల్ రూబా ప్రమోషన్స్ లో ఓ సూపర్ హిట్ సినిమాపై సంచలన కామెంట్స్ చేసాడు. కిరణ్ మాట్లాడుతూ ‘ నేను నా వైఫ్ కొద్ది రోజుల క్రితం మలయాళ సూపర్ హిట్ సినిమా మార్కో సినిమా చూడాలని థియేటర్ కు వెళ్లాము. కానీ ఆ సినిమాలో శృతి మించిన వైలెన్స్, రక్తపాతం నా వైఫ్ చూడలేక ఇబ్బంది పడింది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న నా వైఫ్ మోర్ వైలెంట్ గా ఉన్న మార్కో చూసేందుకు ఇబ్బంది పడడంతో సినిమా మధ్యలోనే థియేటర్ నుండి వెళ్లిపోయాం’ అని అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మార్కో ఫ్యామిలీ ఆడియెన్స్ తో చూసే సినిమా కాదని కిరణ్ కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొద్ది రోజులో రాబోతున్న దిల్ రూబా పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ యంగ్ హీరో మరో సినిమా KRAMP త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.