Site icon NTV Telugu

Taraka Ratna: ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను-తరుణ్

Tarun

Tarun

గత నెల 27న కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో లోకేష్  ‘యువగళం’ పాద్రయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురై 22 రోజుల పాటు మరణంతో పోరాడి శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. నందమూరి తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన హీరో తరుణ్, తారకరత్నతో తనకి ఉన్న ఫ్రెండ్షిప్ ని గుర్తు చేసుకోని ఎమోషనల్ అయ్యాడు. “చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, మా ఇద్దరిదీ ఒకటే స్కూల్. ఏం చెప్పాలో తెలియట్లేదు. అంతా బాగుంది ఆరోగ్యంగా తిరిగి వస్తాడు అనుకుంటే ఇలా జరగడం మా అందరికీ తీరని లోటు. పర్సనల్ గా ఇది నాకు చాలా పెద్ద లోటు, ఒక మంచి స్నేహితుడిని కోల్పోయని. అందరితో నవ్వుతూ, స్నేహంగా మెలిగే తారకరత్న త్వరగా మరణించడం బాధించింది. దేవుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని తరుణ్ మీడియాతో మాట్లాడారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆడే సమయంలో కూడా తారకరత్న, తరుణ్ లు చాలా స్నేహంగా మెలిగే వాళ్లు.

Read Also: NTR 30: తారకరత్న అకాలమరణం కారణంగా ఎన్టీఆర్ 30 వాయిదా…

Exit mobile version