అనతి కాలంలోనే మంచి మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్ . ప్రస్తుతం ఈ అమ్మడు నందమూరి బాలకృష్ణ తో ‘డాకు మహారాజ్’ మూవీలో కథానాయకగా నటిస్తోంది. తెలుగు అభిమానులంతా భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా జోరును చేస్తున్నారు చిత్ర బృందం.
Also Read : Daaku Maharaaj : నేడే డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇందులో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, సినిమాకి సంబంధించిన, బాలయ్యకి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది నటి మాట్లాడుతూ ‘ ఇండస్ట్రీకి వచ్చి ఇని ఏళ్ళు అవుతున్నప్పటికి కూడా నేనొక బిగ్ స్టార్ ని అనే అహం బాలకృష్ణ లో కొంచెం కూడా నాకు కనిపించలేదు. సెట్స్ లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో చాలా సరదాగా ఉంటాడు. దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. సినిమా కోసం ఏం చెప్తే అది అలసట అనకోకుండా చేయడానికి ఎప్పుడూ రెడిగా ఉంటారు. ఇలాంటి వ్యాక్తిని నాలైఫ్ లో చూడలేదు.ఇక మూవీ గురించి చెప్పాలి అంటే ఇప్పటివరకు నేను విభిన్న సినిమాలు చేశాను. కానీ ‘డాకు మహారాజ్’ మూవీ మాత్రం ఒక పూర్తి ప్యాకేజ్ అని చెప్పాలి. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. ఇలాంటి సినిమా నేను ఇప్పటి వరకు చేయలేదు. ఈ చిత్రం ద్యారా బాలకృష్ణ గారి అభిమానులకు ప్రేక్షకులకు నా ప్రతిభను చూపించుకునే అవకాశం దక్కింది’ అంటూ చెప్పుకొచ్చింది.