Site icon NTV Telugu

Hyper Aadi: హైపర్ ఆదికి పెళ్లయ్యిందా? షాక్ అవుతున్న అభిమానులు

Hyper Aadi

Hyper Aadi

Hyper Aadi: జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ఒకడు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో పాటు అదిరిపోయే సెటైర్లతో అతడు హంగామా చేస్తుంటాడు. ప్రతి స్కిట్‌లో కూడా కావాలనే లవ్, మ్యారేజ్ లాంటి అంశాలను జొప్పిస్తుంటాడు. హైపర్ ఆది వేసే పంచులు, కామెడీ టైమింగ్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బుల్లితెర ఆడియన్స్ అతడిని బాగా ఇష్టపడతారు. హైపర్ ఆది ఇంకా పెళ్లి చేసుకోలేదు. అతడు పెళ్లి చేసుకోబోతున్నాడని ఎలాంటి సమాచారం కూడా లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైపర్ ఆది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. తాజాగా అతడి పెళ్లి ఫోటోలను కొందరు వైరల్ చేస్తున్నారు.

Read Also: వామ్మో ఫుల్ జోష్ లో రకుల్.. సెగపుట్టిస్తున్న అందాలు

ఈ ఫోటోలలో పట్టుబట్టలతో, మెడలో దండలతో హైపర్ ఆది దంపతులు చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలను చూసి అతడి అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే ఇది రియల్ పెళ్లి కాదని.. రీల్ పెళ్లి అని తెలుస్తోంది. గతంలో ఓ సినిమా కోసం హైపర్ ఆది పెళ్లి సన్నివేశం చిత్రీకరించగా అందులోని సన్నివేశాన్ని ఎడిట్ చేసి కొందరు నెటిజన్‌లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. హైపర్ ఆది రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా హైపర్ ఆది తాను త్వరలో పెళ్లి చేసుకుంటానని గతంలో చాలాసార్లు చెప్పాడు. అయితే తోటి యాంకర్స్ సుధీర్, ప్రదీప్ పెళ్లి తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు.

Exit mobile version