Hyper Aadi: జబర్దస్త్ లో సైడ్ ఆక్టర్ గా ఎంటర్ అయ్యి.. కంటెస్టెంట్ గా, టీమ్ లీడర్ గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కమెడియన్ హైప్ ఆది. తన పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, స్టార్ కమెడియన్ గా మారి.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క డైలాగ్ రైటర్ గా, ఇంకోపక్క కమెడియన్ గా.. రెండు చేతులా సంపాదిస్తున్నా హైపర్ ఆది పెళ్లి ఎప్పుడు అనేది మిస్టరీగా మారింది. ఎప్పటినుంచో ఆయన అభిమానులు ఆయన పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హైపర్ ఆది.. ఒక యాంకర్ ప్రేమలో ఉన్నాడని టాక్ నడుస్తోంది. ఆది కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆమె చాలా సపోర్ట్ గా నిలిచింది అంట. మొదట స్నేహితులుగా ఉన్న ఈ జంట కొద్దిరోజులకే ప్రేమలో పడ్డారట. అయితే కెరీర్ సెట్ అయ్యేవరకు ఇంట్లో చెప్పకూడదని అనుకుని.. ఈ మధ్యనే ఇరు కుటుంబాలకు చెప్పారట.
Naresh: మా బిల్డింగ్ గురించి మా ప్రెసిడెంట్ ను అడగండి.. నన్ను కాదు
ఇక వీరి పెళ్ళికి కుటుంబసభ్యులు కూడా అంగీకరించారట. త్వరలోనే హైపర్ ఆది.. తాను ప్రేమించిన అమ్మాయిని అభిమానులకు పరిచయం చేయనున్నాడట. అన్ని మంచిగా కుదిరితే ఈ ఏడాది హైపర్ ఆది ఒక ఇంటివాడు కానున్నాడని సమాచారం. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక హైపర్ ఆది సినిమాలతో పాటు.. రాజకీయాలలో కూడా యాక్టివ్ గా ఉన్న విషయం తెల్సిందే. జనసేన తరపున ఆది ప్రచారం చేస్తున్నాడు. పవన్ గురించి కానీ, జనసేన గురించి కానీ ఎవరైనా విమర్శించి మాట్లాడితే మాత్రం వాళ్ళను ఏకిపారేస్తూ జనసైనికులకు అండగా ఉంటున్నాడు. మరి ముందు ముందు జనసేనలో ఆదికి ఏదైనా పదవి దక్కుతుందేమో చూడాలి.