Hyderabad New CP Kothakota Srinivas Reddy Sensational Comments on Tollywood: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో కీలకమైన అధికారులు అందరూ మారుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటల్‌లో బాధ్యతలు ఆయన స్వీకరించారు. శ్రీనివాస్ రెడ్డి గతంలో గ్రేహౌండ్స్, అక్టోపస్‌లో పనిచేయగా ఆయన ముక్కుసూటి అధికారి అనే పేరుంది. ఇక బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయన సినీ రంగం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ని డ్రగ్స్ రహిత నగరంగా మారుస్తానని పేర్కొన్న ఆయన డ్రగ్స్ విషయం గురించి మాట్లాడుతూ సినీ పరిశ్రమను హెచ్చరించారు. పబ్స్, హైఎండ్ బార్స్ & రెస్టారెంట్లు, ఫాం హౌస్ ల తర్వాత సినీ ఫీల్డ్ లో కూడా విరివిగా అలవాటు ఉందని తన దృష్టికి వచ్చిందని అన్నారు.
Actor Ravindra Berde: ‘సింగం’ నటుడు కన్నుమూత
ఇలాంటి విషయాలపై కఠినమైన శిక్షలు ఉంటాయని, వీటిపై ఉక్కుపాదం మోపబోతున్నామని అదే సమయంలో ఇప్పటికే హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం పాతుకు పోకుండా ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, ఈ సమయంలో పూర్తిగా కూకటి వేళ్లతో సహా పెకలించి వేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని, దాని ప్రకారం తాము నడుచుకుంటామని నూతన హైదరాబాద్ సీపీ తెలిపారు. అదే సమయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పై కూడా సీపీ కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఈ మధ్య అవహేళనకు గురైందని, అందరితోను ఫ్రెండ్లీ ఉండడం కూడా నష్టమే అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని గౌరవించే వారితో తాము ఫ్రెండ్లీ గానే ఉంటాం, కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.