Huma Qureshi Shares A Bad Experience Of Her With Reviewer: సోషల్ మీడియా కల్చర్ పెరిగినప్పటి నుంచి నెటిజన్లు, ముఖ్యంగా ట్రోలర్లు సెలెబ్రిటీలను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఆయా తారల తప్పేమీ లేకపోయినా సరే, పనిగట్టుకొని మరీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, వారిపై వ్యంగ్యాస్త్రాలు చేస్తున్నారు. తాము చేస్తున్న వ్యాఖ్యలు వారిని బాధిస్తాయన్న విషయాన్ని కూడా గ్రహించకుండా, పైశాచికానందం పొందుతుంటారు. ఎవరితో తిరుగుతున్నారు? వారెలా ఉన్నారు? పొట్టిగా, సన్నగా, లావుగా ఉన్నారా? అనే కోణాల్లోనూ ట్రోల్ చేస్తుంటారు. చాలామంది సెలెబ్రిటీలైతే బాడీ షేమింగ్ వంటివి ఎదుర్కున్నారు. బాలీవుడ్ నటి హుమా ఖురేషీ కూడా ఆ బాధితుల్లో ఒకరు. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ నటి బాడీ షేమింగ్‌కి గురవుతూనే ఉంది. ఈమధ్యే కొంచెం తగ్గింది కానీ, గతంలో మాత్రం బరువు ఎక్కువగా ఉందంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే.. తనని ట్రోలర్స్ కంటే ఓ రివ్యూవర్ తన బరువుపై కామెంట్ చేయడమే ఎక్కువగా బాధించిందంటూ తాజాగా హుమా ఓ అనుభవం గురించి పంచుకుంది.
Bus Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుద్దుకున్న లగ్జరీ బస్సులు.. ఆరుగురు మృతి
తాజాగా ఓ ఇంటర్వూ ఇచ్చిన హుమా.. గతంలో ఓ రివ్యూవర్ తన బరువు గురించి కామెంట్ చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సంఘటన గురించి మాట్లాడుతూ.. ‘‘మీకు సినిమా నచ్చకపోతే ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే, అది మీ ఛాయిస్. కానీ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? అసలెందుకు వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తారు? నాకైతే ఇలా చాలాసార్లు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఒకసారి నేను నటించిన సినిమా రిలీజైన తర్వాత.. ఒక రివ్యూవర్ నా నటన గురించి మాట్లాడకుండా, నా బరువు గురించి రాశారు. హీరోయిన్లకు ఉండాల్సిన దానికంటే, ఐదు కిలోలు ఎక్కువగా ఉన్నారని ఆ రివ్యూవర్ పేర్కొన్నారు. అది చూసి, నాలో ఏమైనా లోపం ఉందా అనే డౌట్ నాకొచ్చింది. ఆ విషయం నన్ను బాధించింది. ఇంకా చెప్పాలంటే సినిమాలకు రివ్యూవర్లు ఒక రివ్యూలా రాయడం కాకుండా, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. మమ్మల్ని కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారు’’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే.. ఇప్పుడు తాను ఆ వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోనని, కేవలం కెరీర్‌పై ఫోకస్ పెట్టానని వెల్లడించింది.
Minor Girl Gangrape: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఆలయం సమీపంలో మైనర్‌పై గ్యాంగ్‌రేప్