NTV Telugu Site icon

Jailer: సిల్హౌట్-రజినీకాంత్… మ్యాజిక్ మేడ్ ఇన్ హెవెన్

Jailer

Jailer

సూపర్ స్టార్ రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మ్యాచ్ చేసే హీరో, ఆ చరిష్మాని బీట్ చేసే హీరో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడు. మూడున్నర దశాబ్దాలుగా స్టైల్ కి సినానిమ్ గా, స్వాగ్ కి ఐకాన్ గా నిలుస్తున్న రజినీ… నడక, మాట, చూపులో కూడా ఒక ఆరా ఉంటుంది. ఎంతమంది స్టార్ హీరోలు వచ్చినా, సూపర్ స్టార్ ని మాత్రం ఆ విషయంలో బీట్ చేయడం ఇంపాజిబుల్. ముఖ్యంగా రజినీకాంత్ స్టైల్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసేది సిల్హౌట్ షాట్స్. రజినీ-సిల్హౌట్ షాట్స్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అనే చెప్పాలి. ఈ గ్రేస్ ని పర్ఫెక్ట్ గా వాడుతూ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ సినిమాలోని హుకుమ్ సాంగ్ ని షూట్ చేసినట్లు ఉన్నాడు. సూపర్ సుబు రాసిన లిరిక్స్, అనిరుధ్ వోకల్స్, అనిరుధ్ కంపోజ్ చేసిన ట్యూన్ ‘హుకుమ్’ సాంగ్ ని గూస్ బంప్స్ తెప్పించేలా చేసాయి.

ఈ లిరికల్ వీడియోలో రజినీకాంత్ గ్రే అండ్ పెప్పర్ లుక్ లో మస్త్ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో రజినీ ఈ రేంజులో కనిపించలేదు. నెల్సన్ సిల్హౌట్ షాట్స్ ని, గన్ ఫైరింగ్ షాట్స్, కత్తి పట్టుకోని నడిచే వాకింగ్ షాట్స్ ని వాడుతూ వింటేజ్ రజినీకాంత్ ని గుర్తు చేసాడు. ముఖ్యంగా వెల్డింగ్ చేసే సీన్ లో రజినీకాంత్ ని ఫోర్ గ్రౌండ్ లో పెట్టి బ్యాక్ గ్రౌండ్ లో ఫైర్ ఎఫెక్ట్ ఇచ్చిన షాట్ కి రజినీ ఫ్యాన్ అనే వాడు ఎవడైనా సరే డైరెక్టర్ నెల్సన్ కి సలాం కొట్టాల్సిందే. హుకుమ్ సాంగ్ తో జైలర్ సినిమా ప్రమోషన్స్ పీక్ స్టేజ్ కి వెళ్లాయి, ఆగస్టు 10న సినిమా రిలీజ్ కానుంది. అంటే రాబోయే మూడు వారాలు రజినీకాంత్ పేరు, జైలర్ టైటిల్ సోషల్ మీడియాని రూల్ చేయడం గ్యారెంటీ.

Show comments