NTV Telugu Site icon

Prabhas: బిగ్ సర్ప్రైజ్ రెడీ.. Project K అంటే ఏంటి?

Project K

Project K

పోయిన నెల ఆదిపురుష్‌తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన ప్రభాస్.. ప్రస్తుతం సలార్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. జస్ట్ ఒక్క టీజర్‌తోనే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు ప్రభాస్. 24 గంటల్లో 83 మిలియన్స్ వ్యూస్, రెండు రోజుల్లో 100 మిలియన్ మార్క్ టచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కె నుంచి బిగ్ అనౌన్స్మెంట్ లోడ్ అవుతోంది. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా కనిపించనున్నాడు. రీసెంట్‌గానే కమల్ ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యారు. తాజాగా ఈ చిత్రం అరుదైన గౌరవాన్ని అందుకుంది.

Read Also: Sharukh: జవాన్ ట్రైలర్ అనౌన్స్మెంట్ వచ్చేసింది… టార్గెట్ సలార్ రికార్డ్స్?

జూలై 20న శాన్ డియాగో కామిక్-కాన్ వేడుకలో ప్రాజెక్ట్ కె టైటిల్‌ రివీల్ చేయనున్నారు. ఇదో ప్రౌడ్ మూమెంట్ అని ప్రకటించారు మేకర్స్. ఈ వేడుకలకు ప్రభాస్, కమల్‌,అమితాబ్‌, దీపికా, నాగ్ అశ్విన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ కె అంటే ఏంటి? అనే ఎగ్జైట్మెంట్ అందరిలోను ఉంది. అందుకే మేకర్స్.. ప్రాజెక్ట్ కె అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందా? అంటూ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. What is #ProjectK… The world wants to know! Come Kloser…First drop today at 7:10 PM (IST)/ 6:40 AM (PST) అని ట్వీట్ చేశారు. ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు. దీంతో ఈరోజు సాయంత్రం ప్రాజెక్ట్ కె నుంచి సాలిడ్ హింట్ రాబోతోంది.