యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తెరపై దేవరగా చూపించడానికి కొరటాల శివ ఒక భారీ యుద్ధమే చేస్తున్నాడు. శంషాబాద్ ని ఏకంగా సముద్రాన్ని దించుతూ హ్యూజ్ సెట్ ని వేసి మరీ దేవర షూటింగ్ ని చేస్తున్నారు. బాహుబలి తర్వాత ఆ రేంజులో సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా దేవర మాత్రమే. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కొరటాల శివ చేస్తున్న దేవర మూవీ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వనుంది. ఆ డేట్ ని టార్గెట్ చేస్తూ దేవర సినిమాని రిలీజ్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన షూటింగ్ చేస్తున్నారు. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ యాక్షన్ ఎపిసోడ్స్ ని మాత్రమే షూట్ చేసారు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో, విజువల్ రియలిస్టిక్ గా ఉండాలి అంటే గ్రాఫిక్స్ లో క్వాలిటీ ఉండాలి.
విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేసే వాళ్లకి సరిపడా టైం ఇవ్వడానికే దేవర సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేస్తూనే ఉన్నాడు కొరటాల శివ. లేటెస్ట్ గా వేసిన సముద్రం సెట్ లో కూడా యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్న కొరటాల శివ, ఈ షెడ్యూల్ తో అయినా యాక్షన్ ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేసి.. జాన్వీ కపూర్ ని దించి కాస్త టాకీ పార్ట్ లోకి రండి సార్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. జులాయి సినిమాలో “వీడు మరీ వైల్డ్ గా ఉన్నాడు… కాస్త అమ్మాయిలని పూలని చూపించండ్రా” అనే డైలాగ్ ఉంది కదా… దాదాపు ఇలాంటి పదాలనే వాడుతూ హీరోయిన్ తో షూట్ స్టార్ట్ చేయండి సర్, ఇంకెన్నీ రోజులు వార్ ఎపిసోడ్స్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయాలి అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కాబట్టి కొరటాల యాక్షన్ బ్లాక్స్ ని ముందుగా షూట్ చేయడంలో తప్పులేదు అనే వర్గం కూడా ఉన్నారు. ఎవరు ఏమన్నా దేవర సినిమా మాత్రం ప్రాపర్ పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతుంది.
