Kalyanram: కళ్యాణ్ రామ్ సినిమా సెట్లో భారీ ప్రమాదం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Fire Accident in NKR 21 Sets: చివరిగా డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ తన కెరియర్ లో ఇప్పుడు 21వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా సెట్ లో ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదం గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కథలో భాగంగా ఒక సిబిఐ ఆఫీస్ లో కొంత షూట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సిబిఐ ఆఫీస్ సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది. సుమారు పది రోజుల పాటు ఈ సిబిఐ ఆఫీస్ సెట్ లో షూటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే 9 రోజుల షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఒక రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సెట్టు మొత్తం అగ్నికి ఆహుతి అయినట్లుగా తెలుస్తోంది. 9వ రోజు షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత ఎనిమిది గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని అయితే ఈ విషయం సుమారు ఒకటిన్నర ప్రాంతంలో సినిమా యూనిట్ దృష్టికి వచ్చిందని వెళ్లేలోపు దాదాపు మొత్తం కాలిపోయిందని తెలుస్తోంది.
Maathru: యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్గా ‘మాత్రు’.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ఇక ఈ అగ్ని ప్రమాదం కారణంగా సినిమా యూనిట్ కి దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు నష్టం చేకూరినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ నెలలో పట్టాలెక్కింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటిస్తోంది. విజయశాంతి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బి.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచే ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులను త్వరలో ప్రకటిస్తారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!