Srinivasa Mangapuram : ఘట్టమనేని వారసుడు జయకృష్ణపై భారీ అంచనాలు.. డాన్స్ అదరగొడుతున్నాడుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ‘ఘట్టమనేని’ కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ‘సూపర్ స్టార్’ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ఈ చిత్రంతో ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం హీరో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో.. అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా సెకండ్ సింగిల్ ప్రోమో సూపర్ గా ఉంది. ‘మొదటి సినిమాతోనే జయకృష్ణ మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు. స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీలో తాత కృష్ణ , బాబాయ్ మహేష్ బాబు ఛాయలు కనిపిస్తున్నాయని అభిమానులు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక డాన్స్ లో జయకృష్ణ మంచి ఈజ్ తో చేస్తూ మెప్పించాడు.
Also Read
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
తాత కృష్ణ ఆశీస్సులు, మహేష్ బాబు పర్యవేక్షణలో వైజయంతీ బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం కావడం జయకృష్ణకు పెద్ద ప్లస్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మంచి కథలు ఎంచుకుంటే భవిష్యత్తులో స్టార్ హీరోగా ఎదిగే లక్షణాలు అతడిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్న సినిమాల జాబితాలో ‘పెద్ది’ తర్వాత ‘శ్రీనివాస మంగాపురం’ ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అజయ్ భూపతి దర్శకత్వం, ఘట్టమనేని కుటుంబ బ్యాక్‌గ్రౌండ్ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చాయి. జూన్ 10న విడుదల కానున్న ఈ సినిమాతో జయకృష్ణ బిగ్ సక్సెస్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ తనయ రాషా తడాని ఈ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!