SSMB29 : దర్శక ధీరుడు రాజమౌళి భారీ ప్లాన్ చేస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో చేస్తున్న సినిమాలో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు భారీ ఫైట్ సీన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున బోట్ ఫైట్ యాక్షన్ సీక్వెల్స్ చేయబోతున్నాడంట. ఇందులో మహేశ్ బాబు, ప్రియాంక చొప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. దాదాపు 3వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొనబోతున్నారంట. ఈ సినిమాకు ఇదే హైలెట్ యాక్షన్ సీన్ అని తెలుస్తోంది. దీని కోసం హైదరాబాద్ లో భారీ సెట్స్ వేశారంట. దీన్ని హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆధ్వర్యంలో చేస్తున్నట్టు సమాచారం.
Read Also : Pragya Jaiswal : బాబోయ్.. ప్రగ్యాజైస్వాల్ అరాచకమే..
ఈ ఫైట్ సీన్ కోసం మహేశ్, ప్రియాంకకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్టు సమాచారం. ఈ ఫైట్ సీన్ లో రాజమౌళి మార్క్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారంట. త్వరలోనే దీన్ని కంప్లీట్ చేసుకుని విదేశాల్లో చేసే షెడ్యూల్ కు వెళ్లాలన్నది రాజమౌళి ప్లాన్. అతి త్వరలోనే దీనిపై అప్ డేట్ రాబోతోంది. ప్రస్తుతం దీనిపైనే రాజమౌళి వర్క్ చేస్తున్నారంట. సెట్స్ వేయడం దాదాపు పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఏ విషయం బయటకు లీక్ కాకుండా రాజమౌళి ప్లాన్ చేస్తున్నా సరే.. లీకులు మాత్రం ఆగట్టేదు. ఇప్పుడు ఈ ఫైట్ సీన్ గురించి మూవీ టీమ్ చెప్పకపోయినా.. ఏదో ఒక రకంగా బయటకు సమాచారం వెళ్తూనే ఉంది.
