Site icon NTV Telugu

Bro Movie: జోరు వర్షంలోనూ తగ్గేదేలే… నైజాంలో రచ్చ రేపుతున్న ‘బ్రో’ అడ్వాన్స్ బుకింగ్స్!

Bro Advance Bookings

Bro Advance Bookings

Huge Advance Bookings for Bro the avathar Movie: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ కీలక పాత్రధారులుగా తెరకెక్కిన మూవీ బ్రో ది అవతార్. తమిళంలో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సిత్తం అనే సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టు రీమేక్ చేసారు. అక్కడ డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ సినిమాను ఇక్కడ కూడా తెరకెక్కించగా త్రివిక్రమ్ మాత్రం తన మార్క్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే తో అలరించనున్నాడు. ఇక ఎస్ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో సాంగ్స్ మంచి హిట్ టాక్ కూడా తెచ్చుకున్నాయి. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. జూలై 28 అంటే మరికొద్ది గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్లు కూడా పడనున్నాయని అక్కడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Vikarabad: వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్.. కోట్ పల్లి ప్రాజెక్ట్ వద్ద పరిస్థితులపై ఐజీ షనవాజ్ ఖాసీం ఆరా

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మాత్రం ఒక రేంజ్ లో కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే కొన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉండగా ఇంత వర్షంలోనూ చాలా చోట్ల సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్ము రేపుతున్నాయి. అందుతున్న సమాచారం మేరకు నైజాంగా సంభోదించే తెలంగాణలోని హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో ఈ బుకింగ్స్ గట్టిగానే జరుగుతున్నాయి అని తెలుస్తోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై నిర్మించగా ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ బ్రో అడ్వాన్స్ బుకింగ్స్ రచ్చ చేస్తున్నాయని అంటున్నారు. అయితే ట్రేడ్ వర్గాల వారి అంచనాలు ప్రకారం బుకింగ్స్ జోరుగా ఉన్నప్పటికీ పవన్ గత సినిమాలతో పోలిస్తే కాస్త స్లోగా ఉన్నాయని అంటున్నారు. అయినా అదేమీ పెద్ద ఎఫెక్ట్ కాదని అంటున్నారు.

Exit mobile version