NTV Telugu Site icon

Hrithik – Jr NTR: వార్ చేయడానికి వెళ్లి ఎన్టీఆర్ హృతిక్ తో చేసే పని ఇదా?

Jr Ntr Hrithik Roshan

Jr Ntr Hrithik Roshan

Hrithik Wishes Jr NTR: వార్ చేయడానికి వెళ్లి ఎన్టీఆర్ హృతిక్ తో చేసే పని ఇదా?మే 20న, జూనియర్ ఎన్టీఆర్ 41వ పుట్టినరోజు సందర్భంగా, ఆయన స్నేహితులు – సినీ పరిశ్రమకు చెందిన శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి నటులు తమ వ్యక్తిగత సోషల్ హ్యాండిల్స్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభాకాంక్షలకు ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తూ థాంక్స్ చెబుతూ వస్తుండగా ఇప్పుడు హృతిక్ రోషన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ‘యుద్ధం 2’ కో యాక్టర్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కోసం సోషల్ మీడియాలో తన హృదయపూర్వక విషెష్ తెలియచేశారు.

Anand Deverakonda: టాలీవుడ్లో ఆ ధోరణి మంచిది కాదు : ఆనంద్ దేవరకొండ

తన X హ్యాండిల్‌లో హృతిక్ రోషన్, తారక్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు! సూర్యుని చుట్టూ మరో అద్భుతమైన స్పిన్ ఇక్కడ ఉంది, ఈసారి మేము కలిసి తిరుగుతాము! చివరికి వంటగదిలో ఉన్న విద్యార్థిని చూసి మాస్టర్ గర్వపడతారని నేను ఆశిస్తున్నాను! హాహా ! స్టే హెల్తీ, స్టే బ్లేస్డ్ అంటూ రాసుకొచ్చారు. వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, “హహహ… చాలా ధన్యవాదాలు సర్. సెట్స్‌లో మీతో సామరస్యపూర్వకమైన యుద్ధం జరిగింది. మీతో తిరిగి రావడానికి, కలిసి సూర్యుని చుట్టూ తిరిగేందుకు వేచి ఉండలేను… అందరూ చెప్పినట్లు విద్యార్థి సిద్ధంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు కనిపిస్తాడు, మీరు సిద్ధంగా ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. దీంతో వీరిద్దరూ ఏదో వార్ చేస్తున్నారు అనుకుంటే ఇద్దరూ కలిసి వంట నేర్చుకుంటూ నేర్పించుకుంటున్నారా? అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి.

Show comments