NTV Telugu Site icon

Hrithik Roshan : భారీ సినిమాతో డైరెక్టర్ గా మారుతున్న స్టార్ హీరో..

Hrithik

Hrithik

Hrithik Roshan : హీరోలు డైరెక్టర్లుగా మారడం చాలా అరుదు. కొంత మంది మాత్రమే అలా చేస్తారు. ఇప్పడు ఓ స్టార్ హీరో భారీ సినిమాతో డైరెక్టర్ గా మారబోతున్నారు. ఈ వార్త నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అవుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు హృతిక్ రోషన్. ప్రస్తుతం వార్-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు హృతిక్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. అందుకే ఈ మూవీపై సౌత్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీని తర్వాత ఆయన క్రిష్-4 సినిమా చేయబోతున్నాడు. అయితే క్రిష్ మూడు పార్టులు తీసిన ఆయన తండ్రి రాకేష్ రోషన్ ఈ సినిమాను తీస్తారని అంతా అనుకున్నారు. కానీ రాకేష్ రోషన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.

Read Also : Samantha : నాకు నచ్చినట్టు బతుకుతా.. రూల్స్ పెడితే నచ్చదుః సమంత

తన కొడుకు హృతిక్ రోషన్ క్రిష్-4కు డైరెక్టర్ గా చేస్తారని బాంబ్ పేల్చాడు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశాడు. ‘నిన్ను పాతికేళ్ల క్రితం హీరోను చేశాను. ఇప్పుడు క్రిష్‌-4 సినిమాతో డైరెక్టర్ గా చూడబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది’ అంటూ హృతిక్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే క్రిష్ సిరీస్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పాన్ ఇండియా కల్చర్ లో ఎంత లేదన్నా ఈ సినిమాకు వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలి అంటున్నారు. మరి మొదటిసారి డైరెక్టర్ గా చేస్తున్న హృతిక్.. అంత భారీ సినిమాను హ్యాండిల్ చేస్తాడా అన్నది అనుమానమే.