NTV Telugu Site icon

Salman Khan: టైగర్ తో కలిసిన పఠాన్ అండ్ కబీర్…

Salman Khan

Salman Khan

నవంబర్ 12న ఇండియాస్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ సినిమాని చూడబోతున్నామా అంటే నార్త్ ఆడియన్స్ నుంచి, బాలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. భాయ్ జాన్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 సినిమా వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన టైగర్ ఫ్రాంచైజ్ లో భాగంగా టైగర్ 3 తెరకెక్కింది. గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. టైగర్, జోయాల పెయిర్ కి సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు టైగర్ 3 దాదాపు వెయ్యి కోట్లు ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి అంటే సినిమాపై అంచనాలు ఏ రేంజులో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

పఠాన్ సినిమాలో షారుఖ్ తో పాటు సల్మాన్ కూడా కనిపించడంతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయ్యింది. ఇప్పుడు టైగర్ 3లో సల్మాన్ తో పాటు షారుఖ్ కూడా కనిపించనున్నాడు. ఈ ఇద్దరు సూపర్ స్టార్ పై ఒక బ్రిడ్జ్ పైన సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసారు. సల్మాన్, షారుఖ్ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర వచ్చే కలెక్షన్స్ ఏ రేంజులో ఉంటాయో పఠాన్ సినిమా ఇప్పటికే శాంపిల్ చూపించింది. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం… టైగర్ 3లో సల్మాన్, షారుఖ్ తో పాటు హ్రితిక్ రోషన్ కూడా ఉన్నాడని సమాచారం. వార్ సినిమాలో హ్రితిక్ ప్లే చేసిన కబీర్ రోల్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. టైగర్ 3 సినిమాలో కబీర్ క్యామియో ప్లే చేస్తున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు టైగర్ 3పై అంచనాలని హ్రితిక్ క్యామియో న్యూస్ మరింత పెంచేసింది. హ్రితిక్, సల్మాన్, షారుఖ్ లు… పఠాన్, టైగర్, కబీర్ లుగా కనిపిస్తే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ రావడం గ్యారెంటీ. మరి ఈ క్యామియోల విషయంలో నిజమెంత ఉందో తెలియాలి అంటే నవంబర్ 12 వరకూ ఆగాల్సిందే.

Show comments