NTV Telugu Site icon

Hrithik Roshan: ఎవర్రా టామ్ క్రూజ్… మా హృతిక్ ని చూడండి ఒకసారి

Hrithik Roshan

Hrithik Roshan

హాలీవుడ్ యాక్షన్ హీరో అనగానే టామ్ క్రూజ్ గుర్తొస్తాడు. స్టైలిష్ గా ఉంటూనే సూపర్బ్ స్టంట్స్ ని చాలా ఈజీగా చేసే టామ్ క్రూజ్ ని వరల్డ్ వైడ్ సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే టామ్ క్రూజ్ రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మైంటైన్ చేసే హీరో ఇండియాలో కూడా ఉన్నాడు, అతని పేరు హృతిక్ రోషన్. తన డాన్స్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, గ్రీన్ గాడ్ లా ఉండే పర్సనాలిటీతో హృతిక్ రోషన్ ఆడియన్స్ ని కట్టి పడేస్తాడు. వార్ సినిమాలో హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్,  ఎన్ని సంవత్సరాలు అయినా హృతిక్ రోషన్ లో ఆ స్వాగ్ తగ్గదు అనే విషయం అర్ధమవుతుంది. ఇదే విషయాన్నీ మరోసారి ప్రూవ్ చేయడానికి, బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడానికి ‘హృతిక్ రోషన్’ నటిస్తున్న ‘ఫైటర్’ సినిమా రిలీజ్ కాబోతోంది.

జనవరి 25న ఫైటర్ సినిమా రిలీజ్ కాబోతోంది. పఠాన్ మూవీని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ ని కూడా తెరకెక్కిస్తుండడం విశేషం. ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్ ‘ఫైటర్ జెట్ పైలట్’గా కనిపించనున్నాడు. దీపికా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకూ చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ని చూడబోతున్నామట. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఫైటర్ సినిమా కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 2023 జనవరి 25న పఠాన్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని 2024 జనవరి 25న బ్రేక్ చెయ్యడానికి ఫైటర్ వస్తున్నాడు. లేటెస్ట్ గా ఇండిపెండెన్స్ డే సంధర్భంగా ఫైటర్ చిత్ర యూనిట్… 57 సెకండ్స్ డ్యూరేషన్ ఉన్న వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియోలో హృతిక్ రోషన్, దీపికా లుక్ ని మేకర్స్ రివీల్ చేసారు. గ్లిమ్ప్స్ ఎండ్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెచ్చే రేంజులో ఉంది. గ్లిమ్ప్స్ తోనే ఇంప్రెస్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ఇంకో ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మూవీతో హృతిక్ రోషన్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయడం గ్యారెంటీ.