NTV Telugu Site icon

Fighter: పఠాన్ రికార్డులని బద్దలు కొట్టడానికి ఫైటర్ వస్తున్నాడు…

Fighter

Fighter

2023 జనవరి 25న ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులని కదిలించిన ‘పఠాన్’ సినిమా రిలీజ్ అయ్యింది. కింగ్ ఖాన్ షారుఖ్ తన రీఎంట్రీని రీసౌండ్ వచ్చేలా వినిపించాడు. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన పఠాన్ సినిమా వెయ్యి కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నార్త్ ఇండియాలో హిందీ బెల్ట్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా పఠాన్ చరిత్రకెక్కింది. ఈ రేంజ్ హిట్ ని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండరు. పఠాన్ సినిమా షారుఖ్ కే కంబ్యాక్ కాదు కష్టాల్లో ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ కి కూడా ప్రాణం పోసింది. ఈ ఒక్క హిట్ తో మొత్తం బాలీవుడ్ ఊపిరి తీసుకుంది అంటే పఠాన్ హిట్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ అనేది అర్ధం చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే సౌత్ సినిమాల దాడి నుంచి బాలీవుడ్ బాక్సాఫీస్ ని పఠాన్ కాపాడింది.

పఠాన్ రికార్డులని బ్రేక్ చెయ్యడానికి, బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడానికి ‘హృతిక్ రోషన్’ నటిస్తున్న ‘ఫైటర్’ సినిమా రిలీజ్ కాబోతోంది. పఠాన్ రిలీజ్ అయిన జనవరి 25నే ఫైటర్ సినిమా రిలీజ్ కాబోతోంది. పఠాన్ మూవీని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ ని కూడా తెరకెక్కిస్తుండడం విశేషం. ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్ ‘ఫైటర్ జెట్ పైలట్’గా కనిపించనున్నాడు. దీపికా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకూ చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ని చూడబోతున్నామట. ఇప్పటికే దాదాపు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఫైటర్ సినిమా కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 2023 జనవరి 25న పఠాన్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని 2024 జనవరి 25న బ్రేక్ చెయ్యడానికి ఫైటర్ వస్తున్నాడు.

Show comments