NTV Telugu Site icon

Acharya : చిరంజీవి అనే పేరు ఎలా వచ్చిందంటే?

Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి… ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ అతికొద్ది మంది టాప్ సెలబ్రిటీలలో ఆయన ఒకరు. ఇక టాలీవుడ్ లో ఆయనకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే ఒక సాధారణ నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసి, ఇప్పుడు దేశంలోనే చెప్పుకోదగ్గ టాలీవుడ్ కే మెగాస్టార్ గా ఎదిగిన ఆయన జీవితకథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇక చిరంజీవి అసలు పేరు శివ శంకర వర ప్రసాద్ రావు అని అందరికీ తెలుసు. కానీ ఆ పేరు చిరంజీవిగా ఎలా మారింది ? అసలు ఎవరు పెట్టారు? అనే డౌట్ ఆయన అభిమానుల్లో చాలామందికి వచ్చే ఉంటుంది. అయితే ఆయన పేరు మార్చుకోవడం వెనుక ఎన్ని కథలు విన్పించినా, అసలు కథేందో తాజాగా జరిగిన ‘ఆచార్య’ ప్రమోషన్స్ లోని డైరెక్టర్స్ మీట్ లో చిరంజీవి స్వయంగా వెల్లడించారు.

Read Also : Nikhil Siddhartha : తండ్రి మృతిపై ఎమోషనల్ పోస్ట్

చిరంజీవి ఈ విషయం గురించి మాట్లాడుతూ “‘పునాది రాళ్లు’ మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు ఏదైనా స్క్రీన్ నేమ్ పెట్టుకుంటే బాగుంటుంది. శివ శంకర వర ప్రసాద్ అనే పేరు పెద్దగా ఉంది అన్పించింది. అప్పటికే ఇండస్ట్రీలో శంకర్, శివ, ప్రసాద్ పేర్లతో కొంతమంది ఉన్నారు. పేరు మార్చుకోవాలి అనే ఆలోచనతోనే నిద్రపోయాను. ఆ సమయంలో ఓ కల వచ్చింది. అందులో నేను శ్రీరాముల వారి పాదాల చెంత కూర్చోగా, బయట నా ఫ్రెండ్ ఒకరు ఓయ్ చిరంజీవి అక్కడే ఎంతసేపు ఉంటావ్? బయటకు రా… అని అన్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు అని చూస్తే ఏ చిరంజీవి నిన్నే పిలుస్తున్నాను అని అంటున్నాడు. తెల్లారిపోయినా ఆ కల అలాగే గుర్తుండిపోయింది. తరువాత మా అమ్మకు చెప్తే పేరు మార్చుకోవాలి అనుకుంటున్నావు కదా… నువ్వు పూజించే ఆంజనేయ స్వామే ఆ పేరు పెట్టాడు అని చెప్పారు. అయితే అప్పటిదాకా ఆ పేరును ఎక్కడా వినలేదు. ఫస్ట్ పెట్టుకుందాం… ఏదైనా తేడాగా ఉంటే తరువాత మార్చుకుందాం అని అనుకున్నాను. తరువాత రోజు సినిమా ప్రెస్ మీట్… అందులో అందరితో పాటు చిరంజీవి అనే పేరును చూసి భావోద్వేగానికి లోనయ్యాను ‘ అంటూ పేరు వెనుక దాగి ఉన్న కథను వెల్లడించారు.