NTR 30: ఇండస్ట్రీలో హిట్లు.. ప్లాపులు అనేవి ఎప్పుడు ఎవరికి వస్తాయో చెప్పడం కష్టం. హిట్ వస్తే హీరో ఖాతాలో.. ప్లాప్ వస్తే డైరెక్టర్ ఖాతాలో పడుతుంది అన్న విషయం అందరికి తెల్సిందే. ఒక హిట్ వస్తే వరుస సినిమాలు ఎలా వస్తాయో.. ఒక ప్లాప్ వస్తే వచ్చిన సినిమాలు కూడా వెనక్కి వెళ్లిపోతాయి. అయితే ఇండస్ట్రీలో డైరెక్టర్ కొరటాల శివ అనుభవిస్తున్న నరకం మాత్రం వేరే లెవల్ అని చెప్పొచ్చు. అసలు పరాజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న అతడి కెరీర్ లో బిగ్గెస్ట్ పరాజయం ఆచార్య. ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణాలు ఏవైనా అయ్యి ఉండొచ్చు.. పాపం నింద మాత్రం డైరెక్టర్ అకౌంట్లోనే పడింది. ఎన్ని అవమానాలు, విమర్శలు.. ప్రతి ఈవెంట్ లోనూ కొరటాల పేరు డైరెక్ట్ గానో, ఇన్ డైరెక్ట్ గానో వినిపిస్తూ ఉండేది. దీనివలన కొరటాల హిట్ సినిమాలను ఎవరు గుర్తుకు తెచ్చుకోలేదు.. పైకి కనిపించే ప్లాప్ ఆచార్య మాత్రమే అందరి కంటికి కనిపించింది.
Kiraak RP: ఆ కర్రీ పాయింట్ వారి భిక్ష.. కిర్రాక్ ఆర్పీపై రాకింగ్ రాకేష్ సంచలన వ్యాఖ్యలు
ఇప్పుడిప్పుడే కొరటాల ఆ ప్లాప్ నుంచి బయటికి వచ్చి మరో సినిమాపై దృష్టి పెడుతున్నాడు. ఆ సినిమానే ఎన్టీఆర్ 30. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఎన్టీఆర్ తోనే వచ్చింది చిక్కు. ఎన్టీఆర్ తో కొరటాల సినిమా చేయటం రిస్క్ కాదు.. రాజమౌళి తరువాత సినిమాను కొరటాల ఒప్పుకొని కొరటాల రిస్క్ చేస్తున్నాడు అనేది అభిమానుల మాట. రాజమౌళితో సినిమా చేసాక ప్రతి హీరోకు ఒక ప్లాప్ గ్యారెంటీ. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. నార్మల్ హీరోగా ఉన్నప్పుడు అయినా రాజమౌళి తరువాత హిట్ అందుకున్న డైరెక్టర్ లేరు. ఆ రికార్డ్ ను కొరటాల బద్దలు కొడతాడా..? లేక ఈయన కూడా ఆ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోతాడా..? అనేది తెలియాలి. నిజం చెప్పాలంటే.. ఇప్పటికే ఆచార్యతో అవమానాలు అందుకున్న కొరటాలకు ఎన్టీఆర్ 30 కనుక నెగెటివ్ టాక్ తెచ్చుకుంది అంటే మరో అవమానం తప్పదు. అభిమానులు ఆయనను ఏకిపారేస్తారు. అందుకే ప్రతి విషయంలోనూ కొరటాల ఆచితూచి అడుగులు వేస్తున్నాడట. మరి ఈ సినిమాతో కొరటాల మళ్లీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.
