నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ నుంచి విడుదల చేసిన ‘బ్లాస్టర్’ టీజర్ ఆకట్టుకుంటుంది. తక్కువ టైమ్ లోనే యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ రాబట్టుకొంటుంది. ఇదిలావుంటే, ఈ టీజర్ దాదాపు తొమ్మిది గంటలు ముందుగానే అర్ధరాత్రి ఆన్లైన్ లో దర్శనం ఇచ్చింది. విడుదల సమయానికి కంటే ముందే అభిమానులందరికి చేరిపోవడంతో చిత్రయూనిట్ అంత కంగుతిన్నారు. దీంతో చేసేది ఏమిలేక ‘సర్కారు వారి పాట’ టీజర్ ను ముందుగానే విడుదల చేయాల్సివచ్చింది. అయితే దీనిపై చిత్రయూనిట్ సీరియస్ గా వుంది. ఇంటి దొంగలే పనే.. అంటూ అన్వేషణ మొదలుపెట్టింది. ఈమేరకు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోండగా.. హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న విడుదల కానుంది.
బ్లాస్టర్ లీక్ పై.. సర్కారు వారు అన్వేషణ!
