NTV Telugu Site icon

House of the Dragon: ఓటీటీలోకి వ‌చ్చేసిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజ‌న్ 2.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?

Hotd

Hotd

House of the Dragon Season2: ఓటీటీల‌లో హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్క‌ర్లేని లేని పేరు “గేమ్‌ ఆఫ్ థ్రోన్స్” 8 సీజన్‌లుగా వ‌చ్చిన ఈ వెబ్ సిరీస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సిరీస్‌కు ప్రీక్వెల్‌గా గాట్ మేక‌ర్స్ “హౌస్ ఆఫ్ ది డ్రాగన్” తెరకెక్కించారు. 2022లో విడుదలైన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 1 ఓటీటీలో రికార్డు వ్యూస్ సాధించింది. తాజాగా, ఈ సిరీస్‌కు సీజ‌న్ 2 విడుదలైంది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక జియో సినిమాలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజ‌న్ 2 ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరియు మరాఠీ భాషల్లో అందుబాటులో ఉన్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Also Read; Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’లో ఆ స్టార్ హీరోలు..?

ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, కింగ్ విసెరీస్ టార్గారియన్ రాజుగా పరిపాలించే సమయంలో తన తరువాత తన కూతురు రెనెరియా టార్గారియన్ రాణిగా ప్రకటిస్తాడు. అయితే మరణం తరువాత విసెరీస్ రెండో భార్య ఆలిసెంట్ తన కుమారుడు ఏగాన్ టార్గారియన్ )ను ఎవరికీ తెలియనివ్వకుండా కొత్త రాజుగా ప్రకటిస్తుంది. విసెరీస్ కుమార్తె రెనెరియా టార్గారియన్ నిజం తెలుసుకుని తనను తాను రాణిగా ప్రకటించుకుంటుంది. రెండో సీజ‌న్‌లో ఐరన్ థ్రోన్ కోసం ఈ రెండు గ్రూపుల మధ్య యుద్ధం జరగనుంది. ఈ సీజన్‌లో ఐరన్ థ్రోన్ ని దక్కించుకునేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: NTR :దేవర షూటింగ్ కు ఫ్యామిలీ తో ఎన్టీఆర్.. పిక్స్ వైరల్..

ఈ సిరీస్‌ను జార్జ్ ఆర్ ఆర్ మార్టిన్ రాయగా, అలాన్ టేలర్ (Alan Taylor) ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా, మాట్ స్మిత్, ఒలివియా కుక్, ఎమ్మా డి’ఆర్సీ, ఈవ్ బెస్ట్, స్టీవ్ టౌసైంట్, ఫాబియన్ ఫ్రాంకెల్, ఇవాన్ మిచెల్, టామ్ గ్లిన్-కార్నీ త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 16 నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా, ఇండియాలో 17నుంచి జియో సినిమా (Jio Cinema) వేదిక‌గా స్ట్రీమింగ్ అవుతుంది.