Honeymoon Express : హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అంటున్న దర్శకేంద్రుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ “హనీమూన్ ఎక్స్‌ప్రెస్”. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని కథ అందిస్తూనే దర్శకత్వం వహించారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించగా కెకెఆర్ సహా మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ మూవీని నిర్మించారు. ఇప్పటికే ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి మూడు పాటలు విడుదల అయి సంగీత ప్రేక్షకుల హృదయాలను దోచగా ఇప్పుడు ఈ సినిమాలోని టైటిల్ ట్రాక్ ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు విడుదల చేసి తన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక ఈ క్రమంలో రాఘవేంద్ర రావు మాట్లాడుతూ “దర్శకుడు బాల నాకు బాగా కావాల్సిన మనిషి, అమెరికాలో చాలా మందికి సినిమా గురించి శిక్షణ ఇచ్చి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో డీన్ గా పనిచేశాడు. ఇప్పుడు సొంత డైరెక్షన్ లో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే మంచి టైటిల్ తో సినిమాను నిర్మించారు. యువతరం పాప్ సింగర్ స్ఫూర్తి జితేందర్ ఈ టైటిల్ పాటను స్వరపరచి ఆలపించగా పాట చాలా మెలోడియస్ గా ఉంది. మా దర్శకుడు బాల, నటించిన నటీనటులకు అందరికి శుభాకాంక్షలు, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని అభిలషించారు. అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి ఆర్ పి పట్నాయక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ టైటిల్ సాంగ్ ను స్ఫూర్తి జితేందర్ కంపోజ్ చేసి ఆలపించడం గమనార్హం. ఇక ఈ పాటకు కిట్టూ విస్సాప్రగడ లిరిక్స్ అందించారు.
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
తాజావార్తలు
-
Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?