Site icon NTV Telugu

Honeymoon Express : హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అంటున్న దర్శకేంద్రుడు

Honeymoon Express

Honeymoon Express

ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ “హనీమూన్ ఎక్స్‌ప్రెస్”. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని కథ అందిస్తూనే దర్శకత్వం వహించారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించగా కెకెఆర్ సహా మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ మూవీని నిర్మించారు. ఇప్పటికే ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి మూడు పాటలు విడుదల అయి సంగీత ప్రేక్షకుల హృదయాలను దోచగా ఇప్పుడు ఈ సినిమాలోని టైటిల్ ట్రాక్ ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు విడుదల చేసి తన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక ఈ క్రమంలో రాఘవేంద్ర రావు మాట్లాడుతూ “దర్శకుడు బాల నాకు బాగా కావాల్సిన మనిషి, అమెరికాలో చాలా మందికి సినిమా గురించి శిక్షణ ఇచ్చి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో డీన్ గా పనిచేశాడు. ఇప్పుడు సొంత డైరెక్షన్ లో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే మంచి టైటిల్ తో సినిమాను నిర్మించారు. యువతరం పాప్ సింగర్ స్ఫూర్తి జితేందర్ ఈ టైటిల్ పాటను స్వరపరచి ఆలపించగా పాట చాలా మెలోడియస్ గా ఉంది. మా దర్శకుడు బాల, నటించిన నటీనటులకు అందరికి శుభాకాంక్షలు, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని అభిలషించారు. అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి ఆర్ పి పట్నాయక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ టైటిల్ సాంగ్ ను స్ఫూర్తి జితేందర్ కంపోజ్ చేసి ఆలపించడం గమనార్హం. ఇక ఈ పాటకు కిట్టూ విస్సాప్రగడ లిరిక్స్ అందించారు.

Exit mobile version