Honeymoon Express: బలవంతం చేసి పెళ్లి చేస్తే అంతే.. ఆసక్తికరంగా టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “హనీమూన్ ఎక్స్ ప్రెస్”. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల జూన్ 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ ను అమల అక్కినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ, “యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ లో ప్రొఫెసర్ గా బాల అమెరికాలో చాలా కాలం పనిచేశారు. అమెరికాలో ఉన్న, ఆయనకు ఏదో ఒకరోజు తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాలని ఉండేది. ఆయన కల ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో నెరవేరినందుకు సంతోషంగా ఉంది. టీచింగ్ ఒక బాధ్యత అయితే ఫిల్మ్ మేకింగ్ మరో సవాలు లాంటిది. మా అన్నపూర్ణ కాలేజ్ ఫాకల్టీలు, స్టాఫ్, స్టూడెంట్స్ ను బాల హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ టీమ్ లోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా టీజర్ ఫన్నీగా, రొమాంటిక్ గా ఉంది. ఈ రోజు సమాజంలోని రొమాంటిక్, వివాహ బంధాలను గురించి ఒక బలమైన కథను చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈరోజు పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండే సబ్జెక్ట్ ఇది. ఈ నెల జూన్ 21న, హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ని ఆదరించి, విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. బాల, ఆయన టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను,” అన్నారు.
దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ, “నా మనసులో అన్నపూర్ణ స్టూడియోస్ కు ప్రత్యేక స్థానం ఉంది. చాలాకాలం నుంచి అమెరికా లో ఉన్న నన్ను, అమల గారు, నాగార్జున గారు ఇండియాకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా కు డీన్ గా బాధ్యతలు అప్పగించారు. వాళ్ల ప్రోత్సాహంతో దర్శకుడిగా నా ఫస్ట్ తెలుగు మూవీ హనీమూన్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించాను. ఇందులో అన్నపూర్ణ కాలేజ్ ఫాకల్టీ, స్టూడెంట్స్ ఇతర స్టాఫ్ అన్ని డిపార్ట్మెంట్లలో కీలకమైన పాత్రలు వహించారు. నా మెంటార్ గా భావించే నాగార్జున గారు మా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చెయ్యడం విశేషం. అలాగే, అమల గారు టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అక్కినేని కుటుంబం నుంచి లభిస్తున్న ఈ సపోర్ట్ కు హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ టీమ్ తరుపున నా కృతజ్ఞతలు. మా మూవీ నుంచి టీ సిరీస్ మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేసిన నాలుగు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కల్యాణి మాలిక్ వీటిని కంపోజ్ చేశారు. స్ఫూర్తి జితేందర్ టైటిల్ సాంగ్ కు మ్యూజిక్ చేశారు. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు జూన్ 21న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సుచిన్ సినిమాస్ (Suchin Cinemas) డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు మా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు” అన్నారు.
Also Read
- Idupu Kayitham : బంతి భోజనాల్లో 'మందు' కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
- మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
- Mythri Ravi : 'ఫౌజీ', 'డ్రాగన్' రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
- Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
తాజావార్తలు
-
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!