సినీ పరిశ్రమలో పెద్ద స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలంటే ఎంతో ఆలోచిస్తారు. భాషలు, మార్కెట్, ప్రమోషన్స్ అన్నీ ప్లాన్ చేయడం పెద్ద సవాలే. అయితే అలాంటి సమయంలో మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ మాత్రం అసలే వెనక్కు తగ్గలేదు. ఆమె తన తాజా సినిమా ‘రేచల్’ ను నేరుగా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఆమె కెరీర్‌లోనే ఒక పెద్ద సాహసంగా చెప్పుకోవాలి.
Also Read : Meena : హీరో వద్దన్నా వినకుండా.. ఒక్కసారి హోటల్‌కు వచ్చి చాన్స్ ఇవ్వమని అడిగాడు: మీనా
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను డిసెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో హనీ రోజ్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా సినిమా గురించి హనీ రోజ్ మాట్లాడుతూ.. “కొంత విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. నేను ఈ కథ విన్న వెంటనే ‘ఇదే నా రీ-ఎంట్రీకి సరైన సినిమా’ అనిపించింది. ‘రేచల్’ ఒక యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్‌ల మిశ్రమమైన సినిమా. ఇందులో నేను చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తున్నాను. ఇది నా ఇప్పటి వరకూ చేసిన పాత్రల అన్నిటి కంటే భిన్నంగా ఉంటుంది. దక్షిణాదిలోనే కాకుండా ఉత్తర భారత ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ కథలో ఉన్న భావోద్వేగాలు, మానవ సంబంధాలు అన్ని భాషల వాళ్లకూ కనెక్ట్ అవుతాయి. అందుకే పాన్ ఇండియా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం ” అని ఆమె తెలిపింది.
ఈ చిత్రంలో నవీన్ పాలి కీలక పాత్రలో నటించగా, ప్రముఖ దర్శకుడు అఫ్రిడ్ షైన్ ఈ మూవీకి కథ అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఈసారి హనీ రోజ్ యాక్షన్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
