NTV Telugu Site icon

Honey Rose: దాని కోసం ఏం చేయడానికైనా రెడీ.. హనీ రోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Honey Rose On Marriage

Honey Rose On Marriage

Honey Rose Interesting Comments: ‘వీరసింహారెడ్డి’ సినిమా రిలీజైనప్పటి నుంచి హనీ రోజ్ పేరు మార్మోగిపోతోందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. సినిమా ఆఫర్ల సంగతేమో కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రైవేట్ బ్రాండ్స్ అయితే ఆమె వెనకాలే క్యూ కట్టేశాయని చెప్పుకోవచ్చు. ఏరికోరి మరీ ఆమెను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. రీసెంట్‌గానే ఆమె హైదరాబాద్‌లో ఒక రెస్టారెంట్‌‌ని ఓపెన్ చేసింది కూడా! నిజానికి.. హనీ రోజ్ 15 ఏళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ‘ఆలయం’ మూవీతో ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన ఆ అమ్మడు, ఆ తర్వాత ‘ఈ వర్షం సాక్షిగా’ అనే మరో సినిమా కూడా చేసింది. కానీ, అవి ఆమెకు తగిన గుర్తింపును తీసుకురాలేకపోయాయి. కానీ, ఇన్నేళ్ల తర్వాత చేసిన వీరసింహారెడ్డి మాత్రం ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక అప్పటి నుంచి ఆమె ఏం చేసినా, ఏం చెప్పినా సెన్సేషన్ అవుతోంది. ఇప్పుడు తాజాగా ఆమె పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

Cruel Daughter: ఒళ్లు గగుర్పొడిచేలా తల్లిదండ్రులను గొడ్డలితో నరికేసింది.. డ్రగ్స్ ఇచ్చి మరీ..

సాధారణంగా కథానాయికలు ఒక వయసుకి వచ్చాక.. పెళ్లి గురించి వార్తలు చర్చలు మొదలవుతాయి. హనీ రోజ్‌కి మూడు పదుల వయసు దాటడంతో.. ఆమెకు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు తరచుగా ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలోనూ పెళ్లి ప్రస్తావన రావడంతో.. ఆమె ఇంట్రెస్టింగ్ జవాబు ఇచ్చింది. పెళ్లి అనేది ఒక పెద్ద బాధ్యత అని, ఆ బాధ్యతని స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. అంటే.. తాను పెళ్లి చేసుకోవడానికి రెడీగానే ఉన్నానని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసిందన్నమాట! అంతేకాదు.. వివాహబంధం బలంగా ఉండటం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని స్పష్టం చేసింది. అంటే.. సినిమాలు మానెయ్యడానికి కూడా సిద్ధంగానే ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే నిజమైతే.. హనీ రోజ్ అభిమానులు ఏమవుతారో ఏమో? అయితే.. తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలి? అతనిపై తన అంచనాలు ఏంటి? అనే విషయాల్ని మాత్రం హనీ రోజ్ పంచుకోలేదు. అలాగే.. పెళ్లికి రెడీగానే ఉన్నానని చెప్పింది కానీ, ఎప్పుడు చేసుకుంటానన్నది కూడా రివీల్ చేయకుండా సస్పెన్స్‌లో పడేసింది.

Extramarital Affair: మరొకరితో భార్య ఎఫైర్.. భర్తకు తెలిసి ఏం చేశాడో తెలుసా?

Show comments