NTV Telugu Site icon

Salaar: మైండ్ బ్లాకయ్యేలా సలార్ తెలుగు హక్కుల రేట్లు

Salaar Rights

Salaar Rights

Telugu States Salaar Movie Rights: ఇండియన్ సినీ పరిశ్రమలో రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘సలార్’ సినిమా ఒకటి. ‘కేజీఎఫ్’ సిరీస్ తో సరికొత్త సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తుండంతో ఈ ప్రాజెక్ట్ కోసం సినీ ప్రేమికులు మాత్రమే కాదు సాధారణ ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా వచ్చిన టీజర్ మీద మిక్డ్స్ టాక్ వచ్చినా ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. నిజానికి మార్కెట్ ను బట్టి చూస్తే ప్రభాస్ చివరి సినిమా ఇబ్బంది పెట్టింది కాబట్టి సలార్ సినిమా హక్కులకి డిమాండ్ తగ్గుందని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే సలార్ థియేట్రికల్ రైట్స్ కళ్ళు చెదిరే రేటుకు అమ్మడానికి నిర్మాణ సంస్థ సిద్ధం అవుతోందని అంటున్నారు.

Maamannan :జూలై 14న తెలుగులో నాయకుడు’గా మామన్నన్ రిలీజ్

తాజాగా అందుతున్న సమాచారం మేరకు రూ 200 కోట్లకు ‘సలార్’ తెలుగు రైట్స్ అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘సలార్’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ నుంచి హోంబలే ఫిలిమ్స్ సంస్థ రూ. 200 కోట్ల రూపాయలు రాబట్టాలని చూస్తోందని టాక్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో థియేట్రికల్ హక్కులను రూ. 140 నుంచి రూ. 160 కోట్లకు అమ్మాలని, ఆంధ్ర 70-80 కోట్ల రేషియో, నైజాం 70-80 కోట్ల రేషియో చెబుతున్నట్టు తెలుస్తోంది. కేజిఎఫ్ 2, కాంతారా సినిమాలను నామినల్ కమిషన్ ఇచ్చి స్వంతగా రిలీజ్ చేసుకున్నారని, అడ్వాన్స్ లు కూడా పెద్దగా తీసుకోకుండానే అప్పుడు చేసినా సలార్ తెలుగు వెర్షన్ మీదే 200 కోట్లు ఆశిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. కమిషన్ల వ్యవహారం పక్కన పెట్టి ఈసారి అవుట్ రేటుకు ‘సలార్’ రైట్స్ అమ్మేయాలని హోంబేలె సంస్థ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.