HIT 2: యంగ్ హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సినిమా హిట్ 2. వాల్ పోస్టర్స్ పతాకంపై నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను పెంచేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఉరికే ఉరికే సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు.
పోరాటమే అంటూ సాగిన ఈ సాంగ్ ను డైరెక్టర్ శైలేష్ కొలను ఆలపించడం విశేషం. ఇకపోతే సాంగ్ ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తోంది. జీవితమే ఒక పోరాటం.. అందులో గెలవాలి అంటూ మోటివేషనల్ లైన్స్ ఆకట్టుకొంటున్నాయి. కృష్ణకాంత్ అద్భుతమైన లిరిక్స్ అందించగా సురేష్ బొబ్బిలి సంగీతం ఆకట్టుకొంటుంది. క్రిమినల్ ను వెతికే పనిలో అడివి శేష్ మనసులో మెదిలే ఆలోచనల సమూహారమే ఈ సాంగ్ అని తెలుస్తోంది. ఇప్పటికే హిట్ 1 తో హిట్ కొట్టిన ఈ డైరెక్టర్ హిట్ 2 తో కూడా హిట్ అందుకొని హిట్ సిరీస్ ను కొనసాగిస్తాడా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.
